ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK: స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లది అదే పంథా.. పేరెంట్స్‌పై వేధింపులతో కటకటాలపాలైన ఎన్నారై!

ABN, First Publish Date - 2023-04-02T09:28:08+05:30

స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లు మారడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్: స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లు మారడం లేదు. కుటుంబ సభ్యులు, తోటి వారిపై వేధింపులతో కటకటాలపాలవుతున్నారు. తాజాగా ఇదే కోవలో బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తికి పేరెంట్స్‌పై వేధింపుల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది. దేవన్ పటేల్ (Daevan Patel) అనే భారతీయుడు డ్రగ్స్‌కు బానిసై (Drug Addiction) డబ్బుల కోసం తల్లిదండ్రులను కొన్నేళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. అయితే, తన డ్రగ్స్‌ వ్యసనానికి డబ్బుల కోసం పేరెంట్స్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఇతడిని యూకే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. కాగా, పటేల్ తన పేరెంట్స్‌ను కలవకుండా బ్రిటన్ పోలీసులు ఇంతకుముందే నిషేధ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ, అతడు వాటిని ఉల్లంఘించాడు.

వోల్వర్‌హాంప్టన్ (Wolverhampton) ఇంటిలో నివాసముంటున్న తల్లిదండ్రులను తరచూ పటేల్ డబ్బుకోసం వేధిస్తుండడంతో 2009, 2013లలో అతడు వారిని కలవకుండా అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. అయితే, పటేల్ వారిని కలిసి మూడుసార్లు ఆదేశాలను ఉల్లంఘించాడు. తనకి 28 పౌండ్స్ (రూ.2,840) ఇచ్చే వరకు పేరెంట్స్‌పై ఒత్తిడి చేశాడు. తల్లిదండ్రులు తమ కుమారుడి చర్యల వల్ల అవమానంగా ఫీలయ్యారు. అయినా మాదకద్రవ్యాలకు బానిసైన సదరు కొడుకు కనికరం లేకుండా డబ్బు ఇవ్వాల్సిందేనని గొడవ పెట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులకు రోజుకు 10 సార్లు ఫోన్ చేశాడు. వారు సమాధానం ఇవ్వకపోతే వారి ఇంటికి కూడా వెళ్లేవాడు. ఇలా వేధింపులు రోజురోజుకీ ఎక్కవు కావడంతో చివరికి పటేల్ తల్లిదండ్రులు అతనికి డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే పోలీసులకు తెలియజేశారు. దాంతో ఇప్పుడు అతడు కార్డిఫ్ జైలులో (Cardiff Prison) జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇది కూడా చదవండి: యూఎస్-కెనడా బార్డర్‌లో విషాదకర ఘటన.. సరిహద్దు దాటుతూ 8మంది మృత్యువాత.. మృతుల్లో భారతీయ కుటుంబం..!

పటేల్‌కు షాపులలో దొంగతనం వంటి నేరాల చరిత్ర కూడా ఉంది. ఈ ఏడాది జనవరి 21, 25, 27 తేదీల్లో నిషేధాజ్ఞను ఉల్లంఘించినట్లు అతను అంగీకరించాడు. దాంతో వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్ట్ (Wolverhampton Crown Court) పటేల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. న్యాయమూర్తి జాన్ బటర్‌ఫీల్డ్ కేసీ మాట్లాడుతూ, పటేల్ తన మాదకద్రవ్య వ్యసనానికి నిధులు ఇవ్వడానికి డబ్బు ఇవ్వమని మానసికంగా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అతని తల్లిదండ్రుల జీవితాలను దుర్భరంగా మార్చాడని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: వామ్మో.. కువైత్ ప్రవాసులపై ఇలా పగ పట్టేసిందేంటి..!

Updated Date - 2023-04-02T10:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising