ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: లేడీ ఎన్నారై సంచలన ఆరోపణలు.. తండ్రి మరణానికి ఎయిర్‌లైన్స్ కారణమంటూ..

ABN, First Publish Date - 2023-11-08T08:03:54+05:30

తన తండ్రి మరణానికి ఎయిర్‌లైన్స్ కారణమని ఓ లేడీ ఎన్నారై (NRI) సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన షాను పాండే( Shanu Pande) తన తండ్రి హరీష్ పంత్‌( Harish Pant) మరణానికి తాము ప్రయాణించిన ఒక ఎయిర్‌లైన్స్ కారమణమని అంటున్నారు.

ఎన్నారై డెస్క్: తన తండ్రి మరణానికి ఎయిర్‌లైన్స్ కారణమని ఓ లేడీ ఎన్నారై (NRI) సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన షాను పాండే( Shanu Pande) తన తండ్రి హరీష్ పంత్‌( Harish Pant) మరణానికి తాము ప్రయాణించిన ఒక ఎయిర్‌లైన్స్ కారమణమని అంటున్నారు. ఇటీవల ఆమె తన తండ్రితో కలిసి ఇండియా నుంచి కెనడాకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రయాణం చేయడానికి తగినంత ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో వచ్చిన హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు.

NRI: అమెరికాలో ఎన్నారైకి జీవిత ఖైదు

కాగా, తాము ప్రయాణించిన విమానయాన సంస్థ ఎయిర్ కెనడా (Air Canada) అమానవీయమైనదని షాను పాండే ఆరోపించారు. తన తండ్రికి మొదట ఛాతీలో నొప్పితో పాటు ఇతర గుండెపోటు లక్షణాలు కనిపించినప్పుడు విమానాన్ని సమీప విమానాశ్రయానికి మళ్లించమని విమాన సిబ్బందిని వేడుకున్నారట. కానీ సిబ్బంది అందుకు నిరాకరించి అమానవీయంగా ప్రవర్తించిందని ఆమె వాపోయారు. ఇక విమానం మాంట్రియల్‌ (Montreal) లో ల్యాండ్ అయ్యే వరకు గంటల తరబడి ప్రయాణం కొనసాగింది. అక్కడ పారామెడిక్స్ హరీష్ పంత్‌ను కాపాడలేకపోయారు. తన తండ్రిని కోల్పోయిన షాను పాండే తీవ్రంగా బాధపడుతున్నారు.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

విమాన సిబ్బంది, విమానయాన సంస్థ నిర్ణయం తీసుకునే ప్రక్రియను కూడా ఆమె ప్రశ్నించారు. విమానంలో మెడికల్ ఎమర్జెన్సీల (Medical Emergency) ను మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే విమానయాన సంస్థని నిందిస్తారు. విమానాన్ని దారి మళ్లించాలా? వద్దా? అని నిర్ణయించడానికి ఏ ప్రమాణాలను ఉపయోగించాలో ప్రయాణికులకు తెలియకపోవచ్చు. విమానాన్ని మళ్లించడం అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. కాగా, హరీష్ పంత్ కేసును సమీక్షించిన వైద్య నిపుణులు అతని లక్షణాలు తీవ్రమైన గుండె జబ్బును సూచించాయని, తక్షణ వైద్య సహాయం అవసరమని చెప్పారు. ఎయిర్ కెనడా విమానాన్ని దారి మళ్లించలేదని, అతని ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని వారు విమర్శించారు. షాను పాండే, ఆమె ఫ్యామిలీ ఇప్పుడు ఎయిర్ కెనడాపై నిర్లక్ష్యం, మరణానికి కారణం కావడం విషయమై దావా వేయడం గమనార్హం.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

Updated Date - 2023-11-08T08:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising