Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2023-06-01T10:49:03+05:30
సింగపూర్‌లోని (Singapore) ఓ హిందూ దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ పూజారి నిర్వాకానికి పాల్పడ్డాడు.
సింగపూర్ సిటీ: సింగపూర్‌లోని (Singapore) ఓ హిందూ దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ పూజారి నిర్వాకానికి పాల్పడ్డాడు. ఏకంగా దేవుడి ఆభరణాలు తాకట్టు పెట్టాడు. వాటి ద్వారా 2 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ.12.22కోట్లు) సంపాదించాడు. ఈ నేరానికి గాను అక్కడి న్యాస్థానం అతనికి 6ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... నిందితుడు కందసామి సేనాపతి (Kandasamy Senapati).. 2013 డిసెంబర్ నుంచి 2020 మార్చి 30న రాజీనామా చేసే వరకు డౌన్‌టౌన్ చైనాలోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో పూజారిగా పని చేశాడు. హిందూ ఎండోమెంట్స్ బోర్డు (Hindu Endowments Board) అతడిని నియమించింది.
2014లో ఆలయ కమిటీ గర్భగుడిలోని సేఫ్ కీలు, కాంబినేషన్ నెంబర్ కోడ్‌ను కందసామికి తెలిపింది. వీటిలో దేవస్థానానికి చెందిన 255 బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ 1.1 మిలియన్ సింగపూర్ డాలర్లు. అయితే, నగలపై కన్నేసిన అతడు ఆలయ కమిటీకి తెలియకుండా 2016 నుంచి వాటిని తాకట్టు పెట్టడం మొదలుపెట్టాడు. అలా ఒక్క 2016లోనే 172 సార్లు ఆలయం నుంచి 66 తులాల బంగారు నగలను తాకట్టు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా 2016 నుంచి 2020 వరకు గుట్టుచప్పుడు కాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. డబ్బు కావాల్సినప్పుడల్లా ఆభరణాలను తాకట్టు పెట్టాడు.
Rs 2000 Rupee Notes: ఒమాన్‌లోని భారత ప్రవాసులకు కొత్త చిక్కు.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు..!
అయితే, ఆడిట్ షెడ్యూల్‌లో మాత్రం ఎవరికీ తెలియకుండా ఆభరణాలన్నింటిని విడిపించి తెచ్చి యథాస్థానంలో ఉంచేసేవాడు. ఇక ఆడిట్ సెషన్లు పూర్తైన తర్వాత కందసామి మళ్లీ ఆభరణాలను తాకట్టు పెట్టేవాడు. ఈ క్రమంలో మార్చి 2020లో కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సింగపూర్ ప్రభుత్వం 'సర్క్యూట్ బ్రేకర్' ( Circuit Breaker ) నిబంధనలు తెచ్చింది. దీంతో ఆలయ అధికారులు ఎక్స్‌టర్నల్ ఆడిట్‌ను ఆలస్యం చేశారు. జూన్ 2020లో జరిగిన ఆడిట్ సమయంలో సేనాపతి ఆలయ ఫైనాన్స్ టీమ్‌లోని ఒక సభ్యునికి తన వద్ద సేఫ్ తాళం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. తన కుటుంబాన్ని చూసేందుకు స్వదేశానికి వెళ్లినప్పుడు తాళం అక్కడే వదిలి వచ్చినట్లు కట్టుకథలు చెప్పాడు. కానీ, ఆడిట్ చేయాల్సిందిగా అధికారులు పట్టుబట్టడంతో చివరికి అతడు తన నేరం ఒప్పుకున్నాడు. అనంతరం ఆలయ ఫైనాన్స్ బృందంలోని సభ్యుడు దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఆభరణాలు తాకట్టు పెట్టినందుకు గాను తన నేరం బయటపడటంతో కందసామి పూజారి పదవికి రాజీనామా చేశాడు. ఇక విచారణలో కందసామి తన తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతడికి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Open Work Permit: ఫ్యామిలీతో సహా కెనడాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే..!
Updated Date - 2023-06-01T10:49:03+05:30 IST