ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: విషాదం.. స్విమ్మింగ్ పుల్‌లో మునిగి ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన!

ABN, First Publish Date - 2023-12-06T07:22:35+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పుల్‌ (Swimming Pool) లో మునిగి చనిపోయాడు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పుల్‌ (Swimming Pool) లో మునిగి చనిపోయాడు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్‌ (Indian Central School) లో 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల సహయా జెబాస్ ప్రజోప్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన స్టడీ టూర్‌లో భాగంగా ఇటీవల అమెరికా (America) వెళ్లాడు. అక్కడ ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో ఒక హోటల్‌లో స్కూల్ విద్యార్థులు స్టే చేశారు. ఆ హోటల్‌ స్విమ్మింగ్ పుల్‌లోనే ప్రజోస్ ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు.

ఇది కూడా చదవండి: UK visa rules: రిషి సునాక్ సంచలన నిర్ణయం.. వీసా నిబంధనలు మరింత కఠినతరం.. భారతీయులపై ఎఫెక్ట్

మృతుడిది తమిళనాడు రాష్ట్రం. అతని తండ్రి సహయా థామస్ రూపాన్ ఖరాఫీ కంస్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తుండగా.. తల్లి వనిత విన్సీ ట్యాలీ గ్రూపులో పని చేస్తోంది. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ప్రజోస్ పేరెంట్స్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అటు కువైత్‌లోని భారత ప్రవాసులు సైతం ఈ ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - 2023-12-06T07:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising