ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian: భారతీయ యువకుడికి రూ.11.16కోట్ల పరిహారం.. 3ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అతడి జీవితాన్నే మార్చేసింది.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-04-06T13:38:04+05:30

మూడేళ్ల క్రితం ఒమన్ నుంచి దుబాయికి (Dubai) వెళ్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు మహ్మద్ బేగ్ మీర్జాకు తాజాగా 5మిలియన్ దిర్హమ్స్ (రూ.11.16కోట్లు) పరిహారం (Compensation) లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: మూడేళ్ల క్రితం ఒమన్ నుంచి దుబాయికి (Dubai) వెళ్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు మహ్మద్ బేగ్ మీర్జాకు తాజాగా 5మిలియన్ దిర్హమ్స్ (రూ.11.16కోట్లు) పరిహారం (Compensation) లభించింది. ఇక ప్రమాదం జరిగిన 2019లో మహ్మద్‌కు ఇరవై ఏళ్లు. ఈ ప్రమాదం కారణంగా అతడి జీవితమే మారిపోయింది. ఎంతో ఆనందకరమైన జీవితాన్ని కోల్పోయి జీవితాంతం బెడ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. జీవితాంతం అతనికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు కూడా. మొదట యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ (UAE Insurance Authority), ప్రాథమిక రాజీ కోర్టు అతనికి 1మిలియన్ దిర్హమ్ల పరిహారంగా అందించింది. పిటిషనర్లు దుబాయి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టును ఆశ్రయించి 5మిలియన్ దిర్హమ్స్ పరిహారాన్ని పొందారు. కాగా, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీమా సంస్థ రెండుసార్లు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన వారికి అక్కడ చుక్కేదురైంది.

అసలేం జరిగిందంటే.. 2019 జూన్‌లో ఒమన్ (Oman) నుంచి యూఏఈకి (UAE) వస్తున్న బస్సు దుబాయిలోని షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుంచి అల్ రషీదియా మెట్రో స్టేషన్ పార్కింగ్ ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్న ఓవర్ హైట్ బారియర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉండగా.. 17 మంది స్పాట్‌లోనే చనిపోయారు. వీరిలో 12 మంది భారతీయులు (Indians) కూడా ఉన్నారు. ఇదే బస్సులో రంజాన్ (Ramdan) సెలవులపై తన తల్లి సమీప బంధువులను కలిసి మస్కట్ (Muscat) నుంచి తిరిగి వస్తున్న మహ్మద్ కూడా ఉన్నాడు. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.

Work Visa Rules: విదేశీయులను ఆకర్షించేందుకు డెన్మార్క్ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

ఇక తీవ్రంగా గాయపడ్డ అతడిని దుబాయిలోని రషీద్ ఆస్పత్రిలో (Dubai Rashid Hospital) అడ్మిట్ చేశారు. అక్కడ రెండు నెలలు చికిత్స పొందాడు. మహ్మద్ మెదడు 50శాతానికి పైగా దెబ్బతిన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దాంతో మునుపటిలా అతడు సాధారణ జీవితం గడపలేడని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా దుబాయి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు (Dubai Court of First Instance) మహ్మద్‌కు 5మిలియన్ దిర్హమ్స్ (Dh5 million) పరిహారాన్ని ప్రకటించింది. కోర్టు తీర్పుపై బాధితుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Abu Dhabi Big Ticket: రూ.45కోట్లు గెలిచిన భారతీయుడు.. తీరా లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్..!

Updated Date - 2023-04-06T13:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising