Hijri New Year: కువైత్‌లో వరుసగా నాలుగు రోజులు సెలవులు..!
ABN, First Publish Date - 2023-07-11T12:18:48+05:30
గల్ఫ్ దేశం కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) ఇస్లామిక్ న్యూఇయర్ (Islamic New Year) సందర్భంగా సెలవులను ప్రకటించింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) ఇస్లామిక్ న్యూఇయర్ (Islamic New Year) సందర్భంగా సెలవులను ప్రకటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకు దేశ వ్యాప్తంగా నాలుగు రోజులు సెలవులు (Holidays) వచ్చాయి. హిజ్రీ న్యూఇయర్ (Hijri New Year) అయిన జూలై 19 నుంచి 22వ తేదీ వరకు వరుసగా 4రోజులు సెలవులు ప్రకటించింది మంత్రిమండలి. 20న రెస్ట్ ఆఫ్ డే కాగా, శుక్ర, శనివారం అక్కడ వీకెండ్ ఉంటుంది. ఇలా కువైత్ వాసులకు న్యూయర్ సందర్భంగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ (Long Weekend) వచ్చింది. అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. తిరిగి 23వ తేదీన యధావిధిగా అన్ని కార్యాలయాలు తెరచుకుంటాయి. ఈ ఏడాది రంజాన్, బక్రీద్ తర్వాత మరో లాంగ్‌వీకెండ్ రావడంతో కువైటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటున్నారు.
Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?
Updated Date - 2023-07-11T12:18:48+05:30 IST