ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కువైత్‌లో కొత్త రకం స్పోర్ట్స్ వీసా.. త్వరలోనే ఫ్యామిలీ వీసాలు కూడా..

ABN, First Publish Date - 2023-06-13T10:58:47+05:30

గల్ఫ్ దేశం కువైత్ కొత్త రకం స్పోర్ట్స్ వీసాలను (New type of Sports Visas) తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖాలీద్ అల్ సభా (Sheikh Talal Al-Khaled Al-Sabah) వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ కొత్త రకం స్పోర్ట్స్ వీసాలను (New type of Sports Visas) తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖాలీద్ అల్ సభా (Sheikh Talal Al-Khaled Al-Sabah) వెల్లడించారు. తద్వారా క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను అభ్యసించడానికి విదేశీయులు సుల్తానేట్‌లో సులువుగా ప్రవేశించవచ్చని తెలిపారు. ఇక ఈ రకమైన వీసా అనేది మూడు నెలల కాలపరిమితితో కువైత్‌లో తాత్కాలిక నివాసానికి అనుమతిస్తుందన్నారు. అలాగే కువైత్‌లో (Kuwait) ప్రవేశించిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు రెన్యువల్ అవకాశం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

1959 నాటి అమిరి డిక్రీ నం. 17లోని ఆర్టికల్-11 ప్రకారం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇక ఈ వీసాను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ (General Directorate of Residence Affairs) నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తింపు పొందిన క్రీడా క్లబ్‌లు, గుర్తింపు పొందిన సాంస్కృతిక మరియు సామాజిక సంస్థలు, అసోసియేషన్ల అభ్యర్థనను సమర్పించిన తర్వాత జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ద్వారా మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

UAE: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే..!

ఇదిలాఉంటే.. ఏడాదికి పైగా ఆగిపోయిన కుటుంబ, విజిట్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఆర్డర్ కొత్త ఆశను కలిగించింది. అధికారిక సమాచారం ప్రకారం కువైత్ మరోసారి విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబాలను అనుమతించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా దేశంలోని వారి ప్రియమైన వారితో తిరిగి కలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంలో కువైత్ తీపి కబురు చెప్పనుందని మాత్రం తెలిసింది.

NRI: ఆర్థిక నేరస్థుడిగా ఎన్నారై వ్యాపారవేత్త.. అసలు ఎవరీ రామచంద్రన్ విశ్వనాథన్..?


Updated Date - 2023-06-13T10:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising