ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: బీకేర్‌ఫుల్ ప్రవాసులూ.. ఈ తప్పు చేశారో.. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్.. కువైత్ బ్యాంకుల నయా కండీషన్..!

ABN, First Publish Date - 2023-04-20T07:37:58+05:30

గల్ఫ్ దేశం కువైత్‌‌లోని బ్యాంకులు (Kuwait Banks) ప్రవాస ఖాతాదారులకు (Expatriate clients) కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌‌లోని బ్యాంకులు (Kuwait Banks) ప్రవాస ఖాతాదారులకు (Expatriate clients) కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. ప్రవాస ఖాతాదారుల రెసిడెన్సీ పర్మిట్ (Residency Permit) గడువు ముగిసిన వెంటనే వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ (Bank Accounts Freeze) చేయడం లేదా నగదు విత్‌డ్రా పరిమితులను తగ్గిస్తున్నాయి. అక్కడి స్థానిక మీడియా సమాచారం ప్రకారం వలసదారుల సివిల్ కార్డు గడువు ముగిసిన తొలి రోజు నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చేస్తుంది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వెంటనే సంబంధిత ప్రవాసుడు దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్నట్లు పరిగణించబడతాడు. అలాంటి ఖాతాదారులతో బ్యాంకులు లావాదేవీలు జరిపితే అది చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. అందుకే అక్కడి బ్యాంక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా ఏజెన్సీలు వెల్లడించాయి.

సివిల్ ఐడీ (Civil ID Card) గడువు ముగియడం వలన వినియోగదారుని అన్ని సాధారణ నగదు ఉపసంహరణ లావాదేవీల నుండి పరిమితం చేస్తుంది. లోన్ జారీతో పాటు (ముందుగా రుణానికి ఆమోదం లభించిన కూడా) వీసా, మాస్టర్ కార్డ్ కార్డ్‌ల ద్వారా విత్‌డ్రాలకు కూడా ఇది వర్తిస్తుంది. అధికారిక నివేదిక ప్రకారం, కొన్ని బ్యాంకులు ఖాతాను పూర్తిగా స్తంభింపజేస్తుండగా, మరికొన్ని విత్‌డ్రా పరిమితిని తగ్గిస్తున్నాయి. కనుక ఈ ఫ్రీజింగ్ ప్రక్రియ ఒక్కో బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. ప్రవాసులు వారి రెసిడెన్సీని పునరుద్ధరించే వరకు ఈ ఖాతాల స్తంభింపజేయడం అనేది వర్తించబడుతుంది.

UK: బ్రిటన్‌లో బీచ్‌కు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని.. అనుమానాస్పద మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..!


కస్టమర్ తన సివిల్ కార్డును పునరుద్ధరించుకోలేకపోతే స్తంభింపచేసిన సంబంధిత ఖాతాను మూసివేయడానికి అతడు/ఆమె దరఖాస్తును సమర్పించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే, ఇలాంటి కారణంతో ఖాతా మూసివేయబడితే క్లయింట్ కొత్త ఖాతాను తెరవడంలో అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తక్కువ జీతం ఉన్న కార్మికులకు ఇది మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తుందట.

Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..

Updated Date - 2023-04-20T07:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising