Kuwait: కువైత్ సంచలన నిర్ణయం.. 10వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!
ABN, First Publish Date - 2023-03-29T11:27:15+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10వేల మంది ప్రవాసులను (Expats) దేశం నుంచి బహిష్కరించింది. కాగా, వీరందరూ వివిధ ఉల్లంఘనలకు పాల్పడినవారు అని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘినవారు (Violatiors) ఉన్నారని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో ఈ పదివేల మందిని వివిధ దఫాలలో దేశం నుంచి పంపించివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, గత ఒక్క నెలలోనే 3వేల మంది వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Kuwait's Ministry of Interior) వెల్లడించింది. ఇక ఇటీవల మంత్రిత్వశాఖ నియమించిన త్రైపాక్షిక కమిటీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా ఇలా భారీ మొత్తం ఉల్లంఘనదారులు పట్టుబడుతున్నారు.
ముఖ్యంగా ఈ తనిఖీలు మసాజర్లు, మత్స్యకారులు, రైతులు, స్క్రాప్ వర్కర్లు వంటి నైపుణ్యం లేని కేటగిరీ కిందకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని నిర్వహించడం జరుగుతుంది. కొన్ని ఏజెన్సీలు చట్ట విరుద్ధంగా కొంతమంది జాతీయులకు 2వేల కువైటీ దినార్లకు (రూ.5.36లక్షలు) వీసాలను (Visas) విక్రయిస్తున్నాయని కమిటీ సోదాల్లో తేలింది. దాంతో అలాంటి ఈ ఏజెన్సీలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది. కాగా, దేశంలోని కార్మిక మంత్రిత్వ శాఖ ఇలా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి, నకిలీ కంపెనీల ద్వారా వీసాలు జారీ చేయడం ద్వారా కార్మికులను చట్టవిరుద్ధంగా కువైత్‌కు చేర్చడం, ఆపై వారిని చట్టబద్ధమైన సంస్థలకు బదిలీ చేయడం వంటి చర్యలను అరికట్టడానికి కొత్త మెకానిజాన్ని తీసుకువస్తోంది.
ఇది కూడా చదవండి: ఎన్నారై యూసఫ్ అలీ ఉదారత.. రూ. 22.39కోట్ల భారీ విరాళం..!
Updated Date - 2023-03-29T11:30:30+05:30 IST