Kuwait: ప్రవాసులకు కువైత్ మరో బిగ్ షాక్.. ఏకంగా 5వేల వర్క్ పర్మిట్ల రద్దుకు కసరత్తు!
ABN, First Publish Date - 2023-10-28T10:06:13+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ప్రవాసుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోవడంతో స్థానికుల ఉపాధి అవకాశాలకు గండి పడుతుందుని భావిస్తున్న కువైత్ ఇప్పటికే వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ప్రవాసుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోవడంతో స్థానికుల ఉపాధి అవకాశాలకు గండి పడుతుందుని భావిస్తున్న కువైత్ ఇప్పటికే వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే కువైటీలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని సైతం అమలు చేస్తోంది. ఇప్పుడు మరోసారి ప్రవాసులకు కువైత్ మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఏకంగా 5వేల వర్క్ పర్మిట్ల (Work permits) రద్దుకు కసరత్తు చేస్తోంది. దేశంలో మార్జినల్ వర్కర్ల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో వీధి వ్యాపారు (Street vendors) ల వర్క్ పర్మిట్లను క్యాన్సిల్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ దిశగా ఇప్పటికే సుప్రీం కమిటీ (Supreme Committee) కసరత్తు చేస్తోంది.
India-UAE travel: యూఏఈ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. మీ లగేజీలో ఈ వస్తువులుంటే.. ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..!
వీధి వ్యాపారులు ప్రభుత్వ సర్వీసులకు భారంగా మారినట్లు ఇటీవల వెలువడిన నివేదికలు వెల్లడించాయి. వారి వల్ల ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మార్కెట్లకు నయా పైసా ఆదాయం కూడా సమకూరడం లేదట. వీధి వ్యాపారులకు వర్క్ పర్మిట్ల జారీ అనేది వీసా వ్యాపారానికి (Visa Trade) గేట్‌వేగా మారిందని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ వీధి వ్యాపారులు ఏ సేవలు అందిస్తున్నారో.. ఇప్పటికే సహకార సంఘాలు, సెంట్రల్ మార్కెట్లు అవే సర్వీసులతో ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. అందుకే వీధి వ్యాపారులకు వర్క్ పర్మిట్లు అనవసరం అని సుప్రీం కమిటీ భావిస్తోంది. ఇక అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, మ్యాన్‌పవర్ అథారిటీ (Manpower Authority) జారీ చేసిన వర్క్ పర్మిట్‌లతో వేలాది మంది ప్రవాసులు (Expatriates ) ఈ వ్యాపారాలలో పనిచేస్తున్నారు. జనాభా సమతుల్యత కోసం సుప్రీం కమిటీ ఈ అనుమతుల రద్దును ఆమోదించినట్లయితే కనీసం 5వేల వర్క్ పర్మిట్లను క్యాన్సిల్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. సో.. కువైత్‌లో వీధి వ్యాపారులుగా కొనసాగుతున్న ప్రవాసులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.
Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్
Updated Date - 2023-10-28T10:06:13+05:30 IST