Expatriate Workers: ప్రవాసులకు చుక్కలు చూపిస్తున్న కువైత్.. మరో కొత్త నియామక ప్రక్రియ వైపు అడుగులు!
ABN, First Publish Date - 2023-05-07T14:01:43+05:30
కువైత్ ఇప్పటికే ప్రవాస కార్మికుల (Expatriate Workers) విషయంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
కువైత్ సిటీ: కువైత్ ఇప్పటికే ప్రవాస కార్మికుల (Expatriate Workers) విషయంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కువైత్‌లో అధిక జనాభా ఉన్నవారు కాకుండా కొత్త దేశాల నుంచి ప్రవాస కార్మికులను రిక్రూట్ చేసుకునే అవకాశాలను అన్వేషించడానికి చర్యలు తీసుకోవాలని ఆ దేశ మొదటి ఉప ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సభా (Sheikh Talal Al-Khaled Al-Sabah) ఆదేశించారు. జనాభా అసమతుల్యత సమస్యను ప్రభావితం చేయకుండా దేశంలోని కార్మికుల కొరతను పరిష్కరించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశంగా ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. అధికారులు ఇంతకుముందు విడుదల చేసిన డేటా ప్రకారం.. మొత్తం 9,65,774 జనాభాతో దేశంలో అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీలలో భారతీయులు (Indians) మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఈజిప్షియన్లు (6,55,234), ఫిలిప్పీన్స్ (2,74,777), బంగ్లాదేశ్ (2,56,849), సిరియా (1,62,310) ఉన్నారు. కాగా, కువైత్ దేశ జనాభాలో దాదాపు 60 శాతం వరకు వలసదారులే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Kuwait: ప్రవాసులకు మరో బిగ్ షాక్.. కువైత్‌లో ఆ సర్వీసులకు కొత్త ఫీజులు!
Updated Date - 2023-05-07T14:01:43+05:30 IST