Kuwait: 43 లక్షలు దాటిన కువైత్ జనాభా.. ప్రవాసుల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు..!
ABN, First Publish Date - 2023-03-09T08:48:22+05:30
గల్ఫ్ దేశం కువైత్‌కు (Kuwait) సంబంధించిన రిజిస్ట్రేషన్ సెన్సస్ 2021 ప్రాజెక్ట్ నివేదిక (Kuwait Registration Census 2021 Project) తాజాగా విడుదలైంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌కు (Kuwait) సంబంధించిన రిజిస్ట్రేషన్ సెన్సస్ 2021 ప్రాజెక్ట్ నివేదిక (Kuwait Registration Census 2021 Project) తాజాగా విడుదలైంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ దేశ మొత్తం జనాభా 43,85,717గా తేలింది. ఇందులో కువైటీలు (Kuwaitis) కేవలం 34శాతం మాత్రమే. అంటే సుమారుగా 14,88,718 అన్నమాట. అదే ప్రవాసుల (Expats) వాటా 66శాతం. ఇది 28,97,001కు సమానమని సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ (Central Statistical Administration) వెల్లడించింది. ఇక 30ఏళ్ల లోపు ఉన్న కువైటీ సంఖ్య 9,04,688గా ఉంటే.. మహిళల జనాభా మాత్రం 7,59,578గా ఉంది. అదే కువైటీ పురుషుల సంఖ్య (Kuwaiti males) 7,29,638గా తేలింది.
ఇక మొత్తం 28,96,999 మంది ఉన్న వలసదారుల జనాభాలో 19,41,628 మంది పురుషులు, 9,55,393 మంది మహిళలు ఉన్నట్లు సెన్సస్ నివేదిక వెల్లడించింది. ఇదే రిపోర్ట్ ప్రకారం వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసుల జాబితా కూడా వెల్లడైంది. దీని ప్రకారం రెసిడెన్సీ లాను ఉల్లంఘించిన వలసదారుల సంఖ్య 151992గా ఉంది. అలాగే ఎంట్రీ వీసా (Entry Visa) ఉల్లంఘనదారులు 94,879 మంది ఉంటే.. ఇతర వీసా ఉల్లంఘనలకు పాల్పడినవారు (Violators) 26,985 మంది ఉన్నారట.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ మెట్రో టు సౌదీ మెట్రో.. రియాధ్‌లో మెట్రో రైలు నడుపుతున్న హైదరాబాదీ మహిళ..!
Updated Date - 2023-03-09T08:48:22+05:30 IST