ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eid al-Fitr: రంజాన్ ఎఫెక్ట్.. విమాన టికెట్లకు రెక్కలు.. ఎంత పెరిగాయో తెలిస్తే షాక్ అవుతారు..!

ABN, First Publish Date - 2023-04-23T09:15:13+05:30

రంజాన్ (Ramdan) సందర్భంగా విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: రంజాన్ (Ramdan) సందర్భంగా విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. పౌరులు, నివాసితులు ఈత్ అల్-ఫితర్ (Eid al-Fitr) సెలవులను విదేశాలలో గడపడానికి ఆసక్తి చూపడంతో భారీగా ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన కొన్నిరోజులుగా చాలా మంది ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నారని, ఈద్‌కు వరుస సెలవులు రావడంతో విదేశీ ప్రయాణాలు పెరిగి టికెట్ల ధరలు దాదాపు 300 శాతం మేర ఎగబాకినట్లు ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. కువైత్ నుంచి ప్రధానంగా దుబాయి, సౌదీ, తుర్కీయే, బ్రిటన్, ఈజిప్ట్, ఖతార్‌తో పాటు ఇతర ఐరోపా దేశాలకు ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఇబ్రహీం రాఫత్ అనే ట్రావెల్ ఏజెంట్ మాట్లాడుతూ.. "ప్రయాణీకులు కువైత్ సమీప దేశాలైన జీసీసీ (GCC) దేశాలు, తుర్కీయే, ఈజిప్ట్, లెబనాన్, అజర్‌బైజాన్, జార్జియా వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. ఒక టికెట్ సగటు ధర 200 కువైటీ దినార్లుగా(రూ.53,546) ఉంది. అదే దుబాయికి సగటు ధర 280 కేడీలు (రూ.74,965), జెడ్డాకు 220 కేడీలు (రూ.58,901), ఇస్తాంబుల్‌కి 350 కేడీలు (రూ.93,706), కైరోకు 300 కేడీలు (రూ.80,319). కాగా, చాలామంది ప్రయాణీకులు లండన్, జెనీవా, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలకు వెళ్లారని" ఇబ్రహీం రాఫత్ చెప్పుకొచ్చారు.

Dubai: ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడ్డ భారతీయ మహిళ.. నాలుగేళ్లుగా కారులోనే మకాం.. చివరికి

మరో ట్రావెట్ ఏజెంట్ అద్నాన్ హమది మాట్లాడుతూ.. "రంజాన్ సందర్భంగా చాలామంది ప్రయాణీకులు లండన్, కైరో, దుబాయికి వెళ్లారు. ఇటీవలి భూకంపం తర్వాత ఇస్తాంబుల్‌కు డిమాండ్ తగ్గింది. ఈ సెలవుల సమయంలో ఎయిర్‌లైన్ టిక్కెట్ ధరలు కొన్ని గమ్యస్థానాలకు 300 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. కొన్ని వారాల క్రిత 190 కేడీలతో (రూ.50,869) పోలిస్తే, కైరోకి టికెట్ 270 కేడీలకు (రూ.72,287)చేరుకుంది" అని అద్నాన్ హమది తెలిపారు. సౌదీ ప్రభుత్వం విదేశీయుల కోసం ఆన్‌లైన్ టూరిస్ట్ వీసాను ప్రారంభించిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు కువైత్ నుండి జెడ్డాకు ప్రయాణించారని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నమాట.

H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన

Updated Date - 2023-04-23T09:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising