Kuwait: ఆ దేశ కార్మికులకు కువైత్ బిగ్ షాక్.. అన్ని రకాల వీసాలు బంద్..!
ABN, First Publish Date - 2023-05-10T08:34:50+05:30
ఇటీవల ప్రవాసుల (Expats) విషయంలో తరచూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: ఇటీవల ప్రవాసుల (Expats) విషయంలో తరచూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిలిప్పీన్స్ వర్కర్లకు (Filipino Workers) అన్ని రకాల వీసాల జారీ నిలిపివేసింది. అన్ని ఎంట్రీ, వర్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి, తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్.. రెండు దేశాల మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో ఫిలిప్పీన్స్ విఫలమైనందుకు గానూ ఆ దేశ కార్మికులకు అన్ని వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కువైత్‌లో మూడో అతి పెద్ద కమ్యూనిటీగా ఉన్న ఫిలిప్పీన్స్ కార్మికులకు ఇది గట్టి దెబ్బ అనే చెప్పాలి. అధికారి డేటా ప్రకారం.. మొత్తం 9,65,774 జనాభాతో దేశంలో అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీలలో భారతీయులు (Indians) మొదటి స్థానంలో కొనసాగుతుంటే... ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఈజిప్షియన్లు (6,55,234), ఫిలిప్పీన్స్ (2,74,777), బంగ్లాదేశ్ (2,56,849), సిరియా (1,62,310) ఉన్నారు. కాగా, కువైత్ దేశ జనాభాలో దాదాపు 60 శాతం వరకు వలసదారులే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Eid Al Adha: వరుసగా ఆరు రోజులు సెలవులు.. లాంగ్ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్న ఉద్యోగులు
Updated Date - 2023-05-10T08:34:50+05:30 IST