ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: మానవత్వం పరిమళించిన వేళ.. భాష రాదు, ఊరు తెలియదు అయినా అమ్మను ఆదుకున్నాడు

ABN, First Publish Date - 2023-06-18T08:13:31+05:30

దళారుల చేత దగా బడి.. కన్న వారి కరుణకు దూరమై.. మాతృభూమికు తిరిగి రాలేక.. అలాగని పరాయిగడ్డపై ఉండలేక పక్షవాతంతో కదలలేని స్ధితి జీవచ్ఛవంగా ఎడారినాట గడుపుతున్న ఒక తెలుగు మహిళ దుస్ధితిపై ఎవరో పరాయి మరాఠి యువకుడు చలించి అమెకు కన్న కొడుకులా సేవలందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దళారుల చేత దగా బడి.. కన్న వారి కరుణకు దూరమై.. మాతృభూమికు తిరిగి రాలేక.. అలాగని పరాయిగడ్డపై ఉండలేక పక్షవాతంతో కదలలేని స్ధితి జీవచ్ఛవంగా ఎడారినాట గడుపుతున్న ఒక తెలుగు మహిళ దుస్ధితిపై ఎవరో పరాయి మరాఠి యువకుడు చలించి అమెకు కన్న కొడుకులా సేవలందించాడు. అంతేకాదు విమాన టిక్కెట్ కొని స్వయంగా ఆమె స్వస్ధలం వరకు తోడుగా వచ్చి సురక్షితంగా వదిలిపెట్టడం ద్వారా మానవత్వానికి మార్గదర్శిగా నిలిచాడు.

వివరాల్లోకి వెళ్తే.. ​తూర్పు గోదావరి జిల్లా సఖీనేటిపల్లి మండలానికి చెందిన మూరి పద్మావతి (62) అనే మహిళ రెండు దశాబ్దాల క్రితం కువైత్‌కు వెళ్లింది. ఆ తర్వాత కొద్ది వారాలకే తాను మోసపోయినట్లుగా గ్రహించింది. తనను కాకినాడ, కడప గల్ఫ్ దళారులు దగా చేశారని తెలుసుకుంది. అయితే, వివిధ వీసా నిబంధనలు, అక్కడి చట్టరీత్యా కారణాల వలన అమె స్వదేశానికి తిరిగి రాలేకపోయింది. ఈ రకంగా 20 ఏళ్ళ పాటు కువైత్‌లో చిన్నచితకా పనులు చేస్తూ గడిపింది. ఇటు పద్మావతికి ఇంట కూడా ఆదరణ లభించలేదు. ఆమె పిన డబ్బును వాడుకున్న కుటుంబం ఆమెను మాత్రం వద్దనుకుంది.

ఇక కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె వ్యాధి నుండి కోలుకున్న తర్వాత పక్షవాతానికి గురయి మంచానికే పరిమితమైంది. ఆమె ఇంటి ప్రక్కన నివసిస్తున్న ముంబయి నగరానికి చెందిన మొహమ్మద్ యూనుస్ అనే ఒక యువకుడు పద్మావతి పరిస్ధితి చూసి చలించిపోయాడు. ఆమెకు అన్నం తినిపించడం, తనకు తెలిసిన వైద్యుల నుండి మందులు తీసుకోవచ్చి ఇవ్వడం చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువగానే సేవలు చేశాడు. అంతేకాకుండా ఆమెను భారతదేశానికి పంపించవల్సిందిగా పలుమార్లు భారతీయ ఎంబసీకు వెళ్ళి విజ్ఞప్తి చేశాడు. పద్మావతిని చూసుకుంటూ గత రెండేళ్ళుగా ఆ యువకుడు ముంబయిలోని తన తల్లి వద్దకు కూడా వెళ్ళలేకపోయాడు.

ఈ కేసు గురించి అనేక మంది తెలుగు ప్రముఖులకు వివరించి అలిసిపోయిన యూనుస్ చివరగా ఎట్టకేలకు ఆకుమూర్తి లాజరస్ ద్వారా కువైత్‌లోని ఏపీ ఎన్నార్‌టీ ప్రతినిధులు బి.హెచ్. ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డి, నాయిని మహేశ్ రెడ్డిల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దాంతో ఎంబసీ సహాయంతో ఆమెపై నిషేధాన్ని తొలగించారు. దీంతో ఆమెను వెంట తీసుకోని మొహమ్మద్ యూనుస్ శుక్రవారం కువైత్ నుండి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళాడు. అంబులెన్స్ ఏపీ ఎన్నార్‌టీ సమకూర్చింది. ముంబయి యువకుడి సేవ స్పూర్తిని బాలిరెడ్డి, ఇలియాస్ అభినందించారు.

Updated Date - 2023-06-18T08:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising