NATA: చికాగోలో 'నాటా' ఆత్మీయ సమావేశం

ABN, First Publish Date - 2023-04-16T12:54:59+05:30

'నాటా' సంఘ అధ్యక్షుడు శ్రీ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి నిన్నరాత్రి చికాగోలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

NATA: చికాగోలో 'నాటా' ఆత్మీయ సమావేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో: 'నాటా' సంఘ అధ్యక్షుడు శ్రీ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి నిన్నరాత్రి చికాగోలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటా బోర్డ్ మెంబర్ శ్రీ లింగారెడ్డి వెంకటరెడ్డిగారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈకార్యక్రమానికి చికాగో తెలుగు ప్రముఖులు శ్రీయుతులు హన్మంత్ రెడ్డి, మెట్టుపల్లె జయదేవరెడ్డి, కేకే రెడ్డి, హేమా కానూరి, రాంభూపాల్ రెడ్ది, శేషురెడ్డి కల్యాణ్ ఆనందుల, వెస్ట్మాంట్ ఇండియన్ అసోసియేషన్ ముఖ్యనేతలు, సృజన్,శి వ, వెంకట్, శివారెడ్ది, నరశింహ రావు, ఆది, శేషు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ చివరి వారంలో డల్లాస్ నగరంలో జరుగుతున్న 'నాటా' కన్వెన్సన్ కు ఆహ్వానిస్తూ శ్రీధర్ రెడ్ది సమవేశాన్ని ప్రారంభించారు. ప్రపంచ నలుమూలల నుండి తెలుగు రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నావారిని డల్లాస్ నగరంలో జరిగే నాటా సభలకు ఆహ్వానించమని తెలుగు భాషా సంస్కృతికి పెద్ద పీఠవేస్తున్న 'నాటా' కార్యక్రమాలను జయప్రదం చేయాలని శ్రీధర్ రెడ్డి కోరారు. ఆథిత్యం ఇచ్చిన వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

UAE visa reforms: ఇకపై యూఏఈలోకి ఎంట్రీ చాలా ఈజీ.. అమల్లోకి కొత్తగా 11 ఎంట్రీ పర్మిట్స్..!


Updated Date - 2023-04-16T12:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising