ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: 2,400 మంది ప్రవాస టీచర్ల రెసిడెన్సీ పర్మిట్లు క్యాన్సిల్.. కారణం ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-05-28T09:11:28+05:30

ప్రవాస ఉపాధ్యాయుల విషయంలో కువైత్ విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: ప్రవాస ఉపాధ్యాయుల విషయంలో కువైత్ విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ స్పెషలైజేషన్లకు చెందిన సుమారు 2,400 మంది ప్రవాస టీచర్ల రెసిడెన్సీ పర్మిట్లను (Residency Permits) రద్దు చేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖను విద్యా మంత్రిత్వ శాఖ కోరింది. వీరిలో 1,900 మంది ఉపాధ్యాయులు రీప్లేస్‌మెంట్ ప్లాన్‌లో చేర్చబడిన తర్వాత వారి సర్వీస్‌ను రద్దు చేశారు. మరో 500 మంది స్వచ్ఛందంగా తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో మొత్తం 2,400 మంది విదేశీ టీచర్ల నివాస అనుమతులు రద్దు చేసేందుకు విద్యా మంత్రిత్వశాఖ (Ministry of Education) ప్రాసెస్ మొదలెట్టింది. దీనిలో భాగంగా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మానవ వనరుల విభాగం ప్రస్తుత విద్యా సంవత్సరం 2022-23 చివరిలో సర్వీసులు ముగిసిన కువైటీయేతర ఉపాధ్యాయుల లావాదేవీలను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది.

వారి బకాయిలు చెల్లించడంతో పాటు వర్క్ పర్మిట్‌లను (Work Permits) రద్దు చేయడానికి సంబంధించిన విధానాలను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. వీలైనంత వరకు ప్రవాస టీచర్లు ఎలాంటి జరిమానాలు, రుసుములు చెల్లించకుండా దేశం నుంచి వెళ్లేలా ప్రణాళిక రచిస్తోంది. విద్యాశాఖ మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ ఆదేశాల మేరకు 3 నెలల క్రితం ఆమోదించిన రీప్లేస్‌మెంట్ పాలసీ కోసం విద్యా మంత్రిత్వశాఖ అధికారులు సంబంధిత ప్రాసెస్‌ను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా రీప్లేస్‌మెంట్ పరిధిలోకి వచ్చిన వారి సర్వీసుల రద్దును ఏడాదిపాటు వాయిదా వేయడం సరికాదని అధికారులు అభిప్రాయపడ్డారు.

Eid Al Adha: యూఏఈలో భారీ వీకెండ్.. నివాసితులకు ఏకంగా 10 రోజుల సెలవులు


Updated Date - 2023-05-28T09:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising