ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Abu Dhabi: యూఏఈ విద్యార్థులకు తీపి కబురు.. అబుదాబిలో 'ఐఐటీ-ఢిల్లీ' వేసవి శిక్షణ కార్యక్రమం ప్రారంభం

ABN, First Publish Date - 2023-07-22T12:23:58+05:30

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఢిల్లీ (IIT-Delhi) యూఏఈ విద్యార్థులకు తీపి కబురు అందించింది.

అబుదాబి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఢిల్లీ (IIT-Delhi) యూఏఈ విద్యార్థులకు తీపి కబురు అందించింది. అబుదాబిలో వేసవి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఐఐటీ-ఢిల్లీ యూఏఈలోని విద్యార్థుల కోసం ఔట్‌రీచ్ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక సంస్థ అబుదాబిలో ఐఐటీ-ఢిల్లీతో సహా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సన్నాహకంగా విద్యార్థుల కీలక 'స్టెమ్' (STEM) నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన అనుకూల నిర్మిత ప్రోగ్రామ్‌లతో మ్యాథ్స్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. గత విద్యా సంవత్సరంలో కనీసం 75శాతం జీపీఏ లేదా సైన్-మ్యాథ్స్ సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన వంద మందికి పైగా గ్రేడ్ 10ప్లస్ విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ వారం జరిగిన 'సమ్మర్ ఔట్‌రీచ్ ప్రోగ్రాం'తో వర్క్‌షాప్‌లు ప్రారంభమయ్యాయి.

దీనిలో భాగంగా ఐఐటీ-ఢిల్లీ ప్రొఫెసర్లు విద్యార్థులకు మెటీరియల్స్, రోబోటిక్స్, మానవ శరీరం, డిజైన్ థింకింగ్ సూత్రాలు, డ్రోన్ ఇంజినీరింగ్ తదితర అంశాలలో ఒక ప్రత్యేకమైన లెర్నింగ్ అవకాశాన్ని కల్పించారు. జూలై 24న ప్రారంభమయ్యే ఈ శిక్షణ కార్యక్రమం ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రోగ్రామ్‌లో ఒకే అర్హత ప్రమాణాలతో 30 మంది విద్యార్థులు ప్రముఖ ఐఐటీ-ఢిల్లీ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో ఇంటరాక్టివ్ శిక్షనా సెషన్‌లలో పాల్గొంటారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐఐటీ-ఢిల్లీ అబుదాబి బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల హోస్ట్‌తో తన విద్యా కార్యక్రమాలను ప్రారంభించనుంది.

Indian Citizenship: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 17.50 లక్షల మంది..!

Updated Date - 2023-07-22T12:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising