ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI Couple: బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై జంట.. ఆ తర్వాత వారి ఆనందం చూస్తే..

ABN, First Publish Date - 2023-10-15T11:11:45+05:30

ప్రపంచంలో ఎక్కడా దొరకని మంచి రుచికరమైన ఆహార పదర్థాలు (Tasty Foods) మన దగ్గర దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన భారతీయ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు మన దగ్గర తప్ప వేరే దేశాల్లో పెద్దగా దొరకవనే చెప్పాలి.

ఎన్నారై డెస్క్: ప్రపంచంలో ఎక్కడా దొరకని మంచి రుచికరమైన ఆహార పదర్థాలు (Tasty Foods) మన దగ్గర దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన భారతీయ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు మన దగ్గర తప్ప వేరే దేశాల్లో పెద్దగా దొరకవనే చెప్పాలి. ఈ కారణంగానే విదేశాల్లో నివసించేవారు స్వదేశం నుంచి వచ్చే ఎవరైనా మన ఆహార పదర్థాలు తెస్తే బాగుండు అని ఎప్పుడు కోరుకుంటారు. ఇదిగో ఇదే కోవకు చెందినవారు యూకే రాజధాని నగరం లండన్‌ (London) లో నివాసం ఉండే భార్యాభర్త కరిష్మా, రికిన్. ఈ ఎన్నారై దంపతులకు ఇండియన్ ఫుడ్ అంటే మహా ఇష్టం. అందుకే స్వదేశం నుంచి వస్తున్న వారి మిత్రులను కొన్ని భారతీయ మసాలాలు, స్నాక్స్ తీసుకురావాల్సిందిగా చెప్పారు.

అయితే, స్నేహితులు వారిని సర్ ప్రైజ్ చేశారు. ఆ జంట అడిగిన వాటికంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ (Food Items) తీసుకువచ్చారు. వాటిని ఒక బ్రీఫ్‌కేసులో ప్యాక్ చేసి గిఫ్ట్ రూపంలో అందించారు. అంతే.. ఆ ఫుడ్ ఐటమ్స్‌తో కూడిన గిఫ్ట్ బాక్స్‌ను అందుకుని, దాన్ని తెరిచి చూసిన తర్వాత వారి ఆనందం చూడాలి. వారి ఆనందాన్ని వర్ణించడం మాటల్లో కష్టం. స్నేహితుల నుంచి వారు అందుకున్న ఆ గిఫ్ట్ బాక్స్‌లో కుర్కురే, సేవ్ ఖమ్మి, గరం మసాలా, కశ్మీరీ రెడ్ చిల్లీ, మ్యాగీ, ఆలూ భుజియా, లేస్, వంటివి చాలా ఉన్నాయి. ఇక ఆ బ్రీఫ్‌కేసును తెరుస్తున్న సమయంలో ఈ దంపతులు ఒక వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ దేశీ ఫుడ్స్ (Desi Foods) గిఫ్ట్‌గా ఇచ్చినందుకు వారి స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాదండోయ్ ఆ జంట వారి మిత్రులు ఇచ్చిన ఆ గిఫ్ట్ బాక్స్‌కు 'ఆనందంతో నిండిన బ్రీఫ్‌కేస్' అని పేరు కూడా పెట్టేశారు.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఆ జంట భావాలను అర్థం చేసుకుని భారతీయ ఆహారాన్ని చాలా మిస్ అవుతున్నారని కొంతమంది అన్నారు. మరికొంత మంది మాత్రం విదేశాలలోని భారతీయ స్టోర్లలో కూడా ఈ వస్తువులు దొరుకుతాయని ఉచిత సలహాలు ఇచ్చారు. ఇంకొంత మంది ఈ జంట ఇండియన్ ఫుడ్స్‌ను చూసి ఉత్సాహం వ్యక్తం చేసిన తీరుపై జోకులు పేల్చారు. మీకు సంపాదనే ముఖ్యం.. దాని కోసం మాతృదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారుగా.. మళ్లీ ఇండియన్ ఫుడ్ మీకెందుకు అని కొంతమంది కామెంట్ చేశారు.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

Updated Date - 2023-10-15T13:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising