ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అమెరికాలో ఎన్నారైకి జీవిత ఖైదు

ABN, First Publish Date - 2023-11-07T10:18:43+05:30

భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఎన్నారై (NRI) కి అగ్రరాజ్యం అమెరికాలో న్యాయస్థానం జీవిత ఖైదు (Life imprisonment) విధించింది. 2020లో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఫ్లోరిడా కోర్టు ఎన్నారై ఫిలిప్ మాథ్యూకు తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

ఎన్నారై డెస్క్: భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఎన్నారై (NRI) కి అగ్రరాజ్యం అమెరికాలో న్యాయస్థానం జీవిత ఖైదు (Life imprisonment) విధించింది. 2020లో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఫ్లోరిడా కోర్టు ఎన్నారై ఫిలిప్ మాథ్యూకు తాజాగా జీవిత కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ (Philip Mathew) భార్య మెరిన్‌ జాయ్‌తో కలిసి ఫ్లోరిడాలో నివాసముండేవాడు. ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లోని బ్రోవార్డ్ హెల్త్ ఆస్పత్రిలో మెరిన్ నర్సుగా పని చేసేది. అయితే, ఈ దంపతుల మధ్య కుటుంబ విషయాలపై తరచు గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవలు అంతకంతకు పెరిగాయి. దాంతో భార్యపై మాథ్యూ కోపం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..


ఈ క్రమంలో మెరిన్ జాయ్ (Merin Joy) 2020 జులై 28న రోజులానే డ్యూటీకి వెళ్లింది. ఆ రోజు విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేందుకు సెల్లార్‌లోని పార్కింగ్ ప్లేసుకు వెళ్లింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మాథ్యూ.. మెరిన్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

ఈ కేసు విచారణ ఫ్లోరిడా కోర్టు (Florida Court) లో నాలుగేళ్లు కొనసాగింది. ఇక కేసు విచారణ జరిగిన నాలుగేళ్లపాటు భార్యను చంపిన మాథ్యూ పోలీసుల రిమాండ్‌లోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఫ్లోరిడా కోర్టు తాజాగా మాథ్యూస్‌కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. న్యాయస్థానం తీర్పుపై మృతురాలి పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి ఎట్టకేలకు న్యాయమే జరిగిందని తెలిపారు.

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

Updated Date - 2023-11-07T10:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising