ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI News: కెనడాలో దారుణం.. గ్యాంగ్‌వార్‌లో ఎన్నారై తండ్రికొడుకును కాల్చి చంపిన దుండగులు.. ఉలిక్కిపడ్డ భారతీయ సమాజం!

ABN, First Publish Date - 2023-11-12T13:23:55+05:30

కెనడాలోని ఎడ్మాంటన్‌ (Edmonton) లో జరిగిన గ్యాంగ్‌వార్ ఘటనలో11 ఏళ్ల కుమారుడితో పాటు 41 ఏళ్ల తండ్రి హర్‌ప్రీత్ ఉప్పల్‌ చనిపోయారు. ఆ గ్యాంగ్ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ స్టేషన్ వెలుపల ఇలా తండ్రికొడుకును లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

NRI News: కెనడాలోని ఎడ్మాంటన్‌ (Edmonton) లో జరిగిన గ్యాంగ్‌వార్ ఘటనలో11 ఏళ్ల కుమారుడితో పాటు 41 ఏళ్ల తండ్రి హర్‌ప్రీత్ ఉప్పల్‌ చనిపోయారు. ఆ గ్యాంగ్ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ స్టేషన్ వెలుపల ఇలా తండ్రికొడుకును లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. గురువారం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, హర్‌ప్రీత్ ఉప్పల్‌‌పై 2021లో కూడా ఆ గ్యాంగ్ ఇలాగే తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు పిజ్జా రెస్టారెంట్‌లో అతనిపై కాల్పులు జరిగాయి. అక్కడ తప్పించుకున్న అతడు.. గురువారం గ్యాస్ స్టేషన్ బయట జరిగిన ఘటనలో మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో హర్‌ప్రీత్ ఉప్పల్‌ కుమారుడితో పాటు వచ్చిన మరో బాలుడు మాత్రం సేఫ్‌గా బయటపడ్డాడని పోలీసులు చెప్పారు.

US Shocker: అమెరికాలో 'అమ్మా'నుషం.. పసికందును చంపేసి.. ఏమీ ఎరగనట్టు అంత్యక్రియల కోసం చందాలు వసూలు చేసిన తల్లి.. చివరికి


ఇక ఈ ఘటనతో మరోసారి ఎడ్మాంటన్‌లో గన్‌కల్చర్ మళ్లీ పెరిగిందని అర్థమవుతుందని, గ్యాంగ్‌వార్స్ పుట్టుకురావడం కలవరపెట్టే విషయంగా పోలీస్ అధికారులు వెల్లడించారు. నగరంలో పెరగుతున్న కాల్పులు, ముఠా సంబంధిత నేరాలను వీలైనంత త్వరగా అదుపులోకి తేస్తామని ఎడ్మాంటన్‌ పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, గ్యాంగ్‌వార్ ఘటనలో ఎన్నారై తండ్రికొడుకు చనిపోవడం స్థానికంగా ఉండే భారతీయ సమాజాన్ని ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది. దీనికి కారణమైన వారిని పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని ఎడ్మాంటన్‌‌లోని ఎన్నారైలు అన్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Wife: పుట్టింటికి వెళ్లిన భార్య.. 150 సార్లు కాల్ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు డౌట్.. నేరుగా అత్తారింటికి వెళ్తే..!

Updated Date - 2023-11-12T13:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising