ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI Mother: ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. తాగే నీళ్లల్లో కూడా విషం కలిపారట.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

ABN, First Publish Date - 2023-08-28T11:48:15+05:30

ఆస్ట్రేలియాలో నుంచి కర్నాటకకు వచ్చిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ (Priyadarshini Lingaraj Patil) బెళగావిలో బలవన్మరణాని (Suicide) కి పాల్పడింది.

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలో నుంచి కర్నాటకకు వచ్చిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ (Priyadarshini Lingaraj Patil) బెళగావిలో బలవన్మరణాని (Suicide) కి పాల్పడింది. తన పిల్లల కస్టడీ ఆస్ట్రేలియా అధికారులకు వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఆస్ట్రేలియా నుండి బెంగళూరు వచ్చి అక్కడి నుండి బస్‌లో బెళగావి వెళ్లింది. అక్కడి నుంచి ఆమె గోర్వానకొల్ల గ్రామం సమీపంలో మలప్రభ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి ఆస్ట్రేలియా అధికారులు, ఇంకా కొంతమంది సిడ్నీ ప్రాంత వాసులు కారణమని చెప్పిన ఆమె.. వారు కొంతకాలంగా తనని తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆమె తన సూసైడ్ నోట్‌ (Suicide Note) లో పేర్కొంది.

కాగా, ప్రియదర్శిని కుమారుడు అమర్త్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో ఆ బాలుడిని స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స జరుగుతున్న సమయంలో ఉన్నటుండి అమర్త్యకు సైడ్-ఎఫెక్ట్స్ తలెత్తాయి. దాంతో ఆస్పత్రి అధికారులకు విషయాన్ని చెప్పింది. కానీ, వారు పట్టించుకోలేదు. దాంతో అక్కడి అధికారులు తన పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ ఆస్పత్రిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఆమెకు ఆస్ట్రేలియా అధికారులకు మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఆమె పిల్లలిద్దరినీ ఆస్ట్రేలియా అధికారులు (Australia Officials) తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ వివాదం సద్దుమణగకపోవడంతో ప్రియదర్శిని తన ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని వదిలేసుకుని స్వదేశానికి వెళ్లిపోతానని, తన పిల్లలకు అక్కడే చికిత్స చేయించుకుంటానని అధికారులను కోరింది. అయితే, ఆస్ట్రేలియా అధికారులు అందుకు అంగీకరించలేదు. పిల్లలు దూరం కావడంతో పాటు ఆమె కూడా అనారోగ్యం బారిన పడింది. ఆ బాధతో ఇండియాకి తిరిగి వచ్చిన ఆమె ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది.

ఇక ఆమె తన సూసైడ్ నోట్‌లో.. "మా ప్రాణాలకు ముప్పు ఉంది. నా పిల్లలు, భర్త లింగరాజుల బతుకుతెరువు కోసం నా జీవితాన్నే ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా కుటుంబ శ్రేయస్సు కోసం నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. 2021 నుండి ఇవాళ్టి వరకు డీసీజే (ఆస్ట్రేలియా కమ్యూనిటీస్ అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్) నా కుటుంబాన్ని నాశనం చేసింది. సిడ్నీలోని వెర్లీ స్ట్రీట్ నివాసితులు మమ్మల్ని తీవ్రంగా వేధించారు." అని పేర్కొంది.

అలాగే ఒక పోలీసు అధికారి కుటుంబం తనను ఇబ్బంది పెట్టిందని ఆమె ఆరోపించింది. తన ఇంటికి సరఫరా చేసే నీటిని కూడా విషపూరితంగా మార్చారని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరు, తన అనారోగ్య సమస్యను తట్టుకోలేక ప్రియదర్శిని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Big Alert to Travellers: యూఏఈ వెళ్తున్నారా..? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు లేకుండా చూసుకోండి..!


Updated Date - 2023-08-28T12:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising