కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI TDP: ఛార్లెట్‌లో పరిటాల శ్రీరామ్‌ 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతం

ABN, First Publish Date - 2023-07-06T07:42:22+05:30

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌ పర్యటనను పురస్కరించుకుని నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతమైంది.

NRI TDP: ఛార్లెట్‌లో పరిటాల శ్రీరామ్‌ 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిటాలశ్రీరామ్‌ ప్రసంగం.. అద్భుత స్పందన

NRI TDP: తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌ పర్యటనను పురస్కరించుకుని నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి అభిమానులు, పరిటాల అభిమానులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ చేసిన ఉత్తేజకరమైన ప్రసంగం అందరినీ ఉత్సాహపరిచింది.

P.jpg

ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పాలన వల్ల రాష్ట్ర ప్రగతి బాగా దెబ్బతిందని, అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు ఎన్నారైలు గట్టిగా ప్రయత్నించాలని పరిటాల శ్రీరామ్‌ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐటీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా ఎంతో మంది ఎన్నారైలుగా స్థిరపడడానికి దోహదం చేశాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఎన్నారైలంతా ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని పురుషోత్తమ చౌదరి గూడె, రవి నాయుడు, సచ్చింద్ర ఆవులపాటి, ఠాగూర్ మల్లినేని, వెంకట్ సూర్యదేవర, మహేష్ సూరపనేని, నాగ పంచుమర్తి, కృష్ణ మెడమనూరి, నరసింహ, పురుషోత్తమ, వెంకట్ మాలపాటి తదితరులు సమన్వయ పరిచారు.

Updated Date - 2023-07-06T07:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising