NRI: ఎన్నారై యూకే టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి, కోడెల 75వ జయంతి వేడుకలు
ABN, First Publish Date - 2023-05-16T14:13:35+05:30
ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ శత జయంతి, వారి మానస పుత్రుడు పలనాటి పులి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ 75వ జయంతిని పురస్కరించుకొని, తెలుగు దేశం పార్టీ - ఎన్నారై యూకే టీడీపీ ఆధ్వర్యంలో ఇరువురి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఎన్నారై డెస్క్: ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ శత జయంతి, వారి మానస పుత్రుడు పలనాటి పులి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ 75వ జయంతిని పురస్కరించుకొని, తెలుగు దేశం పార్టీ - ఎన్నారై యూకే టీడీపీ ఆధ్వర్యంలో ఇరువురి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తెలుగు దేశం కుటుంబ సభ్యులు బాణాసంచా కాల్చుతు లండన్‌లో అంబరాన్ని తాకే సంబరాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. కోడెల శివ ప్రసాద్ తనయుడు డా. కోడెల శివరాంను సభావేదికపై జయ కుమార్ (రీజినల్ కౌన్సిలర్ మెంబెర్), శ్రీనివాస్ పాలగుడు(జనరల్ సేకరట్రీ ) సురేష్ కోరం, సుందరు, ప్రసన్న నాదెండ్ల, నరేష్, శ్రీనివాస్ ఆహ్వానించారు. రానా ప్రతాప్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తికట్టించారు. కోడెల శివరాం మాట్లాడుతూ.. ముందుగా అందరికి అన్న నందమూరి తారకరామారావు శత జయంతి, కోడెల శివప్రసాద్ 75 జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆడవారు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని పాటుపడిన నాయకుల జయంతి ఉత్సవాలల్లో భాగంగా ఈ రోజు మదర్స్ డే కూడా కలవడం చూస్తుంటే ఒక త్రివేణి సంగమంలా ఉందని అభివర్ణించారు.
ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషన్.. ఎన్టీఆర్ అంటే ఒక మార్గదర్శుకుడు.. ఎన్టీఆర్ అంటే ఒక ప్రజానాయకుడు.. ఎన్టీఆర్ అంటే ఒక దేవుడు.. అలాంటి దేవుడికి మానస పుత్రుడుగా కోడెల ఉండటం అనేది మా పూర్వజన్మ సుకృతం అని తెలియచెయ్యటానికి గర్వపడుతున్నానని జూనియర్ కోడెల వ్యాఖ్యానించారు. ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారి ప్రతిమతో కూడిన నాణెం ప్రజలకు అందుబాటులోకి రావడం ముదావహం, అలాగే భారతరత్నతో వారికి నిజమైన గౌరవం పాలకులు ఇవ్వాలని శివరామ్ ఆకాక్షించారు.
చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. మా నాన్న గారికి ఆయనకి చాల దగ్గర సంబంధం ఉందని తెలిపారు. ఏదేమైనా ఒక పని బాబు అప్పగించారు అంటే అది అయ్యేవరకు కోడెల నిద్రపోరు అని గుర్తు చేశారు. బాబు, నాన్న గారికి పంచాయితీరాజ్, వైద్య విద్య ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ లాంటివి అప్పచెబితే ఏంతో నిబద్దతతో పని చేశారని పేర్కొన్నారు. ఆ విభాగంలో డ్వాక్రా గ్రూపులు కానివ్వండి, నదుల అనుసంధానం కానివ్వండి, ఇలా ఏది చెప్పిన నిబద్దతతో చేసే నాయకుడు కోడెల శివప్రసాద్ అని కొనియాడారు. ఈ రోజు మనము అందరమూ విదేశాలలో కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే దానిలో బాబు కృషి ఎంతో ఉందన్నారు. ABCD అంటే ఎవ్వరిని అడిగిన A అంటే ఆంధ్ర అని, B అంటే బాబు వలన, C అంటే కంప్యూటర్ రంగంలో, D అంటే డామినేట్ చేసే స్థాయికి మన తెలుగు జాతి చేరిందంటారని ప్రశంసించారు. ఈనాడు, ఈ స్థాయికి చేరామంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం అంటూ కొనియాడారు.
ఇక సోదరుడు లోకేష్ మన రాష్ట్రం కోసం కష్టపడుతూ పాదయాత్ర చేస్తున్నారని గుర్తు చేశారు. 'యువగళం' పేరిట కొనసాగుతున్న పాదయాత్ర ఈ రోజే 100 రోజులు పూర్తి చేసుకోవడం, అలాగే ఈ కార్యక్రమము కలిసి రావటం కూడా చాలా ఆనందదాయకం అని అన్నారు. 'సత్తెనపల్లిలో నేను పిలుపు ఇచ్చాను. ఈ రోజు మార్నింగ్ నుంచి అదే ఏర్పాట్లులో ఉన్నాము. వివిధ కార్యక్రమాలతో నేను ఇక్కడ ఉన్నప్పటికీ మా కార్యకర్తలు ఇచ్చిన పిలుపు మేరకు గ్రాండ్ సక్సెస్ చేసారు. నేను కూడా ఇక్కడ వుంది లోకేష్ 100 రోజుa యాత్రలో భాగంగా ఇలా కలిసి రావటం చాల సంతోషం' అని అన్నారు.
తెలుగు దేశంలో ఎన్నో కుటుంబాలు నలభై ఏళ్ళ నుంచి వెన్నుముకగా ఉన్నాయి. అందులో ఒక కోడెల కుటుంబం, పరిటాల కుటుంబం, అయ్యన కుటుంబం, అశోక్ గజపతి రాజు కుటుంబం, యనముల కుటుంబం ఇంకా చాలా కుటుంబాలు తెలుగు దేశంని అంటిపెట్టుకుని ఉన్నాం. 40 ఏళ్ళ పాటు మా అధినాయకుడు మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకున్నాం. అందులో భాగంగానే వీటిని నిర్వీర్యం చేయ్యటం కోసం కుటుంబాల మీద తప్పుడు ప్రచారాలు, ఆస్తులు లాక్కోవటం లేదా బెదిరించి పార్టీ మారేలాగా ఒత్తిడి చేయ్యటం లేదా రాజకీయాలకి దూరంగా ఉండమని కాంప్రమైజ్ ప్రపోసల్ తీసుకుని రావటం చేస్తున్నారని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు మొదటిగా మా కుటుంబం మీద చేశారని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు దాన్ని కొనగిస్తూ కింజరాపు, అయ్యన, గజపతి రాజు అంత ఎందుకు ఈ రోజున రామోజీ రావు మీద కూడా విషప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు.
'నేను కోడెల బిడ్డగా మీ అందరికి మాట ఇస్తున్నాను. నేను ఎక్కడ రాజీ పడను. నా తండ్రి అడుగుజాడలలో నడుస్తాను. డీ అంటే డీ కొడతాను. మా నాన్న ఆశయాలను, తండ్రి స్థానంలో వున్నా బాబు ఆలోచనలను సోదరుడు లోకేష్ అడుగుజాడలలో పార్టీ విలువలని కాపాడుకుంటూ మా కార్యకర్తలని కాపాడుకుంటాను. సత్తెనపల్లిలో తెలుగు దేశం జెండా ఎగరటం ఖాయం. అలాగే నేను ఒకటికి ఒకటిన్నర తిరిగి ఇవ్వటం ఖాయం' అని ఉపోద్ఘాటించారు. రాబోయే కాలం మనకి ఎన్నికల కాలం, మీ అందరూ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ 2024లో తెలుగదేశం పార్టీ విజయానికి కృషి చేసి, నారా చంద్ర బాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయ్యవలసిన అవశ్యకత ఎంతైనా ఉందంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు తెలుగు దేశం పార్టీ తరుపున పేరు పేరున ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.
Updated Date - 2023-05-16T14:13:35+05:30 IST