ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI Voters: తెలంగాణలో ఎన్నారై ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

ABN, First Publish Date - 2023-10-15T12:37:46+05:30

మరో 45 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule) కూడా విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి.

ఎన్నారై డెస్క్: మరో 45 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule) కూడా విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. ఇక ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో 3.6కోట్ల మంది ఓటర్లు (Voters) ఉన్నారు. కొత్తగా సుమారు 8లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దీనిలో భాగంగానే విదేశాల్లో ఉంటున్న తెలంగాణ ఎన్నారై ఓటర్ల సంఖ్య (NRI Voters in Telangana) బయటకు వచ్చింది. 2014తో పోలిస్తే 2023 నాటికి ఎన్నారై ఓటర్లు భారీగానే పెరిగారు. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.

కాగా, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో కేవలం బోథ్, నారాయణ్‌ఖేడ్ తప్పిస్తే మిగతా 117 నియోజకవర్గాల్లో ఎన్నారై ఓటర్లు (NRI Voters) ఉన్నారు. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 206 మంది ఎన్నారై ఓటర్లు ఉంటే.. ఉప్పల్ (131), కూకట్‌పల్లి (102) వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నాయి. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం కేవలం ఒక్కో ఓటర్ చొప్పున నమోదయ్యారు.

NRI Couple: బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై జంట.. ఆ తర్వాత వారి ఆనందం చూస్తే..


ఇక ఎన్నారైలకు ప్రత్యేకంగా ఓటరు గుర్తింపు కార్డు ఉండదనే విషయం తెలిసిందే. ఒరిజినల్ పాస్‌పోర్టు (Passport) ను చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగాక వీరి ఓటర్ల జాబితాను కూడా ప్రత్యేకంగా నమోదు చేస్తారు. విదేశాల్లో పౌరసత్వం ఉన్నవారు మన దేశంలో ఓటరుగా నమోదుకు అనర్హులు. రాష్ట్రం నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన వారు మాత్రమే ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

Updated Date - 2023-10-15T12:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising