ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN: కువైత్‌లో 'వియ్ స్టేండ్ విత్ సీబీఎన్' కార్యక్రమం విజయవంతం

ABN, First Publish Date - 2023-09-24T07:18:20+05:30

ఎన్నారై టీడీపీ కువైత్‌, జనసేన కువైత్ సంయుక్తంగా 'వియ్ స్టేండ్ విత్ సీబీఎన్' అనే కార్యక్రమాన్ని ఫర్వానియాలోని ద్వైహి ప్యాలస్ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు.

NRI: ఎన్నారై టీడీపీ కువైత్‌, జనసేన కువైత్ సంయుక్తంగా 'వియ్ స్టేండ్ విత్ సీబీఎన్' అనే కార్యక్రమాన్ని ఫర్వానియాలోని ద్వైహి ప్యాలస్ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా సీఐడీ అరెస్టు చేయడాన్ని ఎన్నారైలు తప్పుపట్టారు. గత 12 రోజులుగా రిమాండ్ పేరిట రాజమండ్రి జైల్లో ఉంచి జగన్ ప్రభుత్వం తీర్చుకుంటున్న కక్షపూరిత చర్యలను ముక్తకంఠంతో ఖండించారు.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పనిచేసి సైకో పాలనకు చమరగీతం పాడాలని అన్నారు. చంద్రబాబు దేశంలోనే ఎలాంటి మచ్చలేని నాయకుడని, ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలాగా బయటకు రావాని అందరు ఆకాంక్షించారు. 'వియ్ స్టేండ్ విత్ సీబీఎన్', 'సైకో పోవాలి - సైకిల్ రావాలి', 'జగన్ పోవాలి - పాలన మారాలి', 'ఐ యాం విత్ సీబీఎన్' అనే నినాదాలతో హోరెత్తించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, నాగేంద్రబాబు అక్కిలి, ఈశ్వర్ నాయుడు మద్దిన, బాలకృష్ణ, షేక్ బాషా, దుగ్గి శ్రీనివాస్, కొల్లి ఆంజనేయులు, వంశీ, నరేష్, శివ, చిన్నబాబు గున్న, విసి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గాజులపల్లి, బాలరెడ్డయ్య, గూదే శంకర్, రమేష్, సుబ్బ రాజుదొడ్డి పల్లి , కోడూరి మహేష్ గౌడ్, విజయ్ కుమార్ పసుపులేటి, బొమ్ము నరసింహులు రషీదా, తదితరులు పాల్గొన్నారు.

అలాగే జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, కోనసీమ రాజేష్, దండు వేణు, శేఖర్, బిరడా సూర్యనారాయణ, ఇమ్మిడిశెట్టి సూర్యనారాయణ, ఓబులేసు, రెడ్డయ్య తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు కువైత్ మహాసేన నాయకులు రాపాక రాజేష్, రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, జన సైనికులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-09-24T07:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising