ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR: బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

ABN, First Publish Date - 2023-05-28T07:17:09+05:30

బహ్రెయిన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండువగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్ర జ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బహ్రెయిన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండువగా జరిగింది. ఎన్టీఆర్ అభిమానులు తెలుగు దేశం శ్రేణులు ఘనంగా ఒక పండగ వాతావరణములో ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వదేశం నుండి ముఖ్య అతిథులుగా నారా రోహిత్, గుమ్మడి గోపాల కృష్ణ విచ్చేశారు.

తెలుగు దేశం బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాధ్ బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమైన ఒక మహాపురుషుడు అని అన్నారు. తర తరాలను తన్మయం చేయగల కారణజన్ముడు, చిరస్మరణీయుడు అని కొనియాడారు. అలాగే నారా రోహిత్, గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ, తెలుగు దేశాన్ని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని, మనం అందరం కలిసి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

ప్రవాసీ ప్రముఖులు శివ కుమార్, హరిబాబు, మురళీకృష్ణ, రాజశేఖర్, గోపాల్ చౌదరి, ఇతర వక్తలు ఎన్టీఆర్‌ను, ఆయన తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్‌ని ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప కళాకారుడిగా తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడిగా వర్ణించారు.

కార్యక్రం ఆద్యంతం ఆట పాటలతో ఒక్కో పాత్ర సభికులు ఉత్సాహ పరిచింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో ప్రవాసాంధ్రులు దాదాపు ఐదు వందల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-05-28T07:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising