Indian Citizenship: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 17.50 లక్షల మంది..!
ABN, First Publish Date - 2023-07-22T08:38:19+05:30
2011 నుంచి ఇప్పటివరకు 17.50లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ఎన్నారై డెస్క్: 2011 నుంచి ఇప్పటివరకు 17.50లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఈ ఏడాది జూన్ వరకు 87,026 మంది దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. అయితే, 2022లో అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు లోక్‌సభలో (Lok Sabha) అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా 2011 నుంచి 2023 మొదటి ఆరు నెలల వరకు ఏడాది వారీగా పౌరసత్వాన్ని వీడిన భారతీయుల గణాంకాలను ఆయన తెలియజేశారు.
విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఇక గతేడాది మాత్రం ఈ సంఖ్య 2,25,620కు పెరిగినట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాది జూన్ వరకు 87,026 మంది దేశ పౌరసత్వానికి గుడ్‌బై చెప్పారు. దాంతో 2011 నుంచి 2023 మొదటి అర్ధభాగం వరకు భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 17.50 లక్షలకు చేరిందన్నారు.
H-1B Visa: హెచ్ 1బీ వీసాదారులకు వర్క్ పర్మిట్.. కెనడా పథకానికి భారీ స్పందన..!
కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా (Ministry of External Affairs data) ప్రకారం.. భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారిలో చాలా మంది అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపారు. 2021లో ఏకంగా 7,88,284 మంది యూఎస్ బాట పట్టారు. అమెరికా తర్వాత 23,533 మందితో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది. కెనడా (21,597), యూకే (14,637), ఇటలీ (5,986), న్యూజిలాండ్ (2,643), సింగపూర్ (2,516), జర్మనీ (2,381), నెదర్లాండ్స్ (2,187), స్వీడన్ (1,841), స్పెయిన్ (1,595) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
US: అగ్రరాజ్యంలో విషాదం.. భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. మెదడు దెబ్బతిని కోమాలోకి..
Updated Date - 2023-07-22T08:38:19+05:30 IST