ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఆ రెండు రంగాలకు చెందిన ప్రవాస కార్మికుల విషయంలో కువైత్ సంచలన నిర్ణయం..!

ABN, First Publish Date - 2023-04-04T12:28:35+05:30

ఇటీవల గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కువైత్ సిటీ: ఇటీవల గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా ప్రైవేట్ రంగంలోని ఆర్థిక, టెక్నికల్ విభాగాల్లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగుల సర్టిఫికేట్లను తనిఖీ చేస్తున్నట్లు ప్రకటించింది. సుల్తానేట్ చట్టాల ప్రకారం ప్రవాసుల (Expats) భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం నిరంతరం పని చేస్తుందని ఈ సందర్భంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) వెల్లడించింది. ఇక సోదాల్లో భాగంగా అకాడమిక్ సర్టిఫికేట్స్ (Academic Certificates) చెల్లవని తేలిన వారిని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పీఎఏం (PAM) తెలిపింది. మొదటి ఉప ప్రధాని ఆ దేశాల మేరకు అథారిటీ కార్మిక మార్కెట్ విధానాలను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది. సుమారు 16వేల మంది ప్రవాసుల వర్క్ పర్మిట్లను (Work Permits) ఇప్పటికే రద్దు చేసినట్లు, వారిపై తదుపరి చర్యలు ఉంటాయని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో తాజాగా అథారిటీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలాఉంటే.. కువైత్‌కు (Kuwait) సంబంధించిన రిజిస్ట్రేషన్ సెన్సస్ 2021 ప్రాజెక్ట్ నివేదిక (Kuwait Registration Census 2021 Project Report) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ దేశ మొత్తం జనాభా 43,85,717గా తేలింది. ఇందులో కువైటీలు (Kuwaitis) కేవలం 34శాతం మాత్రమే. అంటే సుమారుగా 14,88,718 అన్నమాట. అదే ప్రవాసుల (Expats) వాటా 66శాతం. ఇది 28,97,001కు సమానమని సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ (Central Statistical Administration) వెల్లడించింది. ఇలా ఆ దేశంలో 65 శాతం వరకు వలసదారులు ఉండడం.. రోజురోజుకు స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో మెల్కొన్న కువైత్ అధికారులు కువైటైజేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల విషయంలోనూ కఠిన నిబంధనలు తీసుకు వచ్చారు.

Work Visa Rules: విదేశీయులను ఆకర్షించేందుకు డెన్మార్క్ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!


Updated Date - 2023-04-04T12:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising