ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Traffic Rules: ప్రవాసులూ జర జాగ్రత్త.. దుబాయిలో కొత్త ట్రాఫిక్ చట్టాలు వచ్చేశాయ్.. ఏకంగా రూ.11 లక్షల జరిమానా దేనికంటే..!

ABN, First Publish Date - 2023-07-07T12:53:56+05:30

దుబాయిలో జూలై 6వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలు (Traffic Rules) అమల్లోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Traffic Rules: దుబాయిలో జూలై 6వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలు (Traffic Rules) అమల్లోకి వచ్చాయి. ఈసారి చట్టాలను ట్రాఫిక్ విభాగం చాలా పకడ్బందీగా రూపొందించింది. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు విధించే జరిమానాలు భారీగా పెరిగాయి. వందలు కాదు, వేలు కాదు ఏకంగా లక్షల్లో ఈ జరిమానాలు ఉండడం గమనార్హం. ఏదైనా ఉల్లంఘనకు పాల్పడి వాహనం జప్తు చేయబడితే.. తిరిగి వాహనాన్ని విడిపించాలంటే ఏకంగా 50వేల దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో అక్షరాలు రూ. 11.22లక్షలు అన్నమాట. ఇది ఒక కొత్త కారు కొనుగోలుకు అయ్యే వ్యయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే దుబాయిలోని ప్రవాసులు (Expats) వాహనాలు వేసుకుని బయటకు వెళ్లేటప్పుడు కూసీంత జాగ్రత్తగా ఉంటే బెటర్. లేకుంటే వారి వాహనాన్ని అమ్మేసిన ఆ జరిమానాలు కట్టడానికి కావాల్సిన మనీ రాకపోవచ్చు. రోడ్డుపై వాహనాలతో వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం తప్పనిసరి లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సింది. ఇక రెడ్ సిగ్నల్ జంప్ చేసే వాహనదారులకు దుబాయిలో వెయ్యి దిర్హమ్స్‌ల జరిమానా, 12 బ్లాక్‌పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాహనం కూడా 30 రోజుల పాటు జప్తు చేస్తారు.

Dubai: వైరల్‌గా మారిన బుడ్డోడి ఇంటర్వ్యూ.. అది చూసి బంపరాఫర్ ఇచ్చిన దుబాయ్ యువరాజు!

ఇదిలాఉంటే.. దుబాయ్ ట్రాఫిక్ చట్టాలకు కఠినమైన జరిమానాలు తప్పు చేసే వాహనదారులకు బలమైన సందేశంగా పనిచేస్తాయని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. రోడ్ సేఫ్టీ యూఏఈ (Road Safety UAE) వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్‌మాన్ (Thomas Edelmann) మాట్లాడుతూ.. "ట్రాఫిక్ చట్టానికి చేసిన కొత్త సవరణలు వివిధ రకాల నిర్లక్ష్య డ్రైవింగ్‌లకు అడ్డుకట్ట వేస్తాయి. వీటిలో కొన్ని ఉద్దేశపూర్వకమైనవి అయితే, మరికొన్ని అపసవ్య ప్రవర్తనతో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా రెడ్ లైట్ జంపింగ్ అనేది ప్రమాదకరమైన చర్యకు సంబంధించి. రెడ్ లైట్ జంపింగ్ ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం వాహనదారుల అపసవ్య ప్రవర్తనతో ముడిపడి ఉంటుంది." అని తెలిపారు.

Georgia Robbery: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. భారత సంతతి యువకుడిని కాల్చి చంపిన ఇద్దరు మైనర్లు..!


Updated Date - 2023-07-07T12:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising