NRI: ఇంగ్లండ్‌లో హత్య.. దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి..
ABN, First Publish Date - 2023-01-22T22:08:29+05:30
ఇంగ్లండ్‌లో రెండేళ్ల నాటి హత్య కేసులో ఓ భారత సంతతి వ్యక్తి దోషిగా తేలాడు.
ఎన్నారై డెస్క్: ఇంగ్లండ్‌లో(England) రెండేళ్ల నాటి హత్య కేసులో ఓ భారత సంతతి వ్యక్తి(Indian Origin) దోషిగా తేలాడు. ఈ మేరకు స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. 2021 జనవరిలో డడ్లీ ప్రాంతంలో మహ్మద్ హరూన్ జెబ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తలపై కాల్చి కారులో పరారయ్యారు. రెండు కుటుంబాల మధ్య గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు దర్యా్ప్తులో తేలింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు భారత సంతతికి చెందిన గుర్‌దీప్ సంధూతో పాటూ హసన్ తస్లీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ దోషులగా ప్రకటిస్తూ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిందని వెస్ట్ మిడ్ ల్యాండ్స్ పోలీసులు తెలిపారు. ‘‘ప్లాన్ ప్రకారం జరిగిన హత్య ఇది. ఇద్దరు పిల్లలు తమ తండ్రిని కోల్పోయారు. ఈ బాధ ఎప్పటికీ తొలగిపోదు’’ అని డిటెక్టివ్ పోలీసు సూపరింటెండెంట్ జిమ్ మన్రో తెలిపారు.
Updated Date - 2023-01-23T00:16:49+05:30 IST