ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dubai: ప్రవాసులు జర జాగ్రత్త.. దుబాయిలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు.. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే..!

ABN, First Publish Date - 2023-11-11T08:37:32+05:30

అరబ్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.

దుబాయి: అరబ్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే ఆ దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా సంభవిస్తుంటాయి. నివాసితులు, దేశ పౌరులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లేనిపక్షంలో భారీ జరిమానాలు, బ్లాక్ పాయింట్స్ వేయడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ అధికారులు వాహనం కూడా జప్తు చేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయి ట్రాఫిక్ పోలీసులు (Dubai Traffic Police) ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న ఒక కీలక అంశానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అదేంటంటే.. అనుమతిలేని చోట వాహనాలను 'యూటర్న్' (U-turn) చేయడం.

UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!


ఇలా నిషేధిత ప్రాంతాల వద్ద ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ వాహనాలను యూటర్న్ చేయడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయి పోలీస్ విభాగానికి చెందిన స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. దాంతో ఈ విషయాన్ని ఇకపై ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ ఉల్లంఘనకు గాను 500 దిర్హమ్స్ (రూ.11,347) జరిమానా, 4 బ్లాక్‌పాయింట్స్ (4 black points) వేయడం జరుగుతుందని తెలిపారు. ఇలా అనుమతిలేని చోట్లలో యూటర్న్ చేయడం వల్ల గత 10నెలల్లో ఏకంగా 29,463 ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనల కారణంగా ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సో.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నివారించడంలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులను ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని దుబాయ్ పోలీసులు కోరారు.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

Updated Date - 2023-11-11T08:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising