ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కువైత్ సర్కార్‌కి ప్రవాసులు చెల్లిస్తున్న.. నెలవారీ కరెంట్ బిల్లులు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ABN, First Publish Date - 2023-11-09T09:57:38+05:30

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ప్రవాసులు భారీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికంగా ఉంటారు.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ప్రవాసులు భారీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికంగా ఉంటారు. దీంతో ప్రవాసుల (Expats) నుంచి ఆ దేశ ఖజానాకు అన్ని రంగాల నుంచి వివిధ బకాయిల రూపంలో నెలవారీగా భారీగానే చేరుతుంది. ఇక తాజాగా విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అక్టోబర్‌లో కేవలం ప్రవాసుల నుంచి వసూలు అయిన ఎలక్ట్రిసిటీ బిల్లు (Electricity Bill) 3.5 మిలియన్ కువైటీ దినార్లు (రూ.94.36కోట్లు ) అని వెల్లడించింది. కాగా, సెప్టెంబర్‌లో ఎలక్ట్రానిక్ పద్దతిలో బిల్లుల చెల్లింపులు ప్రారంభించిన కువైత్.. రెండు నెలల్లో కలిపి 8.4 మిలియన్ కేడీలు (రూ.226కోట్లు) వసూలు అయినట్లు తెలిపింది.

NRI News: అమెరికాలో ఘోరం.. కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి!

ఇదిలాఉంటే.. ప్రవాసులు వివిధ రకాల బకాయిలు చెల్లించేందుకు ఇప్పటికే విద్యుత్, నీటి మంత్రిత్వశాఖ పలు ఏర్పాట్లు చేసింది. ఆయా రంగాల వారీగా ప్రత్యేక అధికారిక ఆన్‌లైన్ సైట్లు, సహేల్ యాప్ (Sahel App), కస్టమర్ సేవా కేంద్రాల ద్వారా ప్రవాసుల బిల్లులు, రుణాలు వసూలు చేస్తోంది. మరోవైపు మంచి నీటి బకాయిలను వసూలు చేయడానికి పబ్లిక్ వర్క్స్ విభాగంతో కలిసి ఎలక్ట్రానిక్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించాలనే ఆలోచనలో మంత్రిత్వ శాఖ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే మంత్రిత్వశాఖ అందించే అనేక ఇతర సేవల కోసం బకాయిలను వసూలు చేయడానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ (Electronic System) ను ఇప్పటికే ప్రారంభించింది.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

Updated Date - 2023-11-09T09:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising