Visit visas: ఆ ఎనిమిది దేశాల పర్యాటకులకు సౌదీ గుడ్‌న్యూస్
ABN, First Publish Date - 2023-08-08T07:33:22+05:30
గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ఎనిమిది కొత్త దేశాల పర్యాటకులకు విజిట్ వీసాలు (Visit visas) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పర్యాటక మంత్రిత్వశాఖ (Ministry of Foreign Affairs) తాజాగా ప్రకటన విడుదల చేసింది.
రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ఎనిమిది కొత్త దేశాల పర్యాటకులకు విజిట్ వీసాలు (Visit visas) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పర్యాటక మంత్రిత్వశాఖ (Ministry of Foreign Affairs) తాజాగా ప్రకటన విడుదల చేసింది. అల్బేనియా, అజర్ బైజాన్, జార్జీయా, కిర్గిజ్‌స్తాన్, మాల్దీవులు, సౌతాఫ్రికా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల పర్యాటకులు ఇకపై విజిట్ వీసా పొందవచ్చని తన ప్రకటనలో పేర్కొంది. ఆయా దేశాల పర్యాటకులు ఉమ్రా నిర్వహించడానికి, బంధువులు లేదా స్నేహితులను సందర్శించడానికి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి కింగ్డమ్‌కి రావొచ్చని మంత్రిత్వశాఖ తెలియజేసింది. అయితే, వీసాపై నిర్ధేశించిన గడువును తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక విజిట్ వీసాదారులు (Visit Visa Holders) హజ్ సమయంలో ఉమ్రా చేయలేరని, వీసాల గడువు ముగిసిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేయబడతాయని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వం బ్రిటన్, ఐర్లాండ్ జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు (Electronic Visa Waiver) ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా బ్రిటీష్ జాతీయులందరూ ఇకపై ప్రయాణానికి ముందు ప్రత్యేకంగా విజిట్ వీసా పొందాల్సి అవసరం లేదు. అలాగే సింగిల్ ఎంట్రీ ద్వారా ఇరు దేశాల పౌరులు సౌదీలో 6 నెలల వరకు బస చేసేందుకు వీలు కల్పించింది. బిజినెస్, పర్యాటకం, రిసెర్చ్, వైద్య ప్రయోజనాల కోసం కింగ్‌డమ్‌ను సందర్శించే రెండు దేశాలవారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
Big Ticket: బర్త్‌డే నాడు కొన్న లాటరీ టికెట్.. దుబాయిలోని భారత ప్రవాసుడికి కోట్లు తెచ్చిపెట్టింది!
Updated Date - 2023-08-08T07:40:45+05:30 IST