ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: భారతీయుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై మనోళ్లకు ఆ టెస్టు తప్పనిసరి..!

ABN, First Publish Date - 2023-06-02T08:56:26+05:30

అరబ్ దేశం సౌదీ అరేబియా భారతీయ కార్మికుల విషయం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి వెళ్లే మనోళ్లకు వృత్తి పరీక్ష తప్పనిసరి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) భారతీయ కార్మికుల విషయం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి వెళ్లే మనోళ్లకు వృత్తి పరీక్ష (Profession Test) తప్పనిసరి చేసింది. సెమీ-స్కిల్డ్, అన్‌స్కిల్డ్ భారతీయ కార్మికులకు (Indian Workers) అతిపెద్ద ఎంప్లాయర్‌లలో సౌదీ అరేబియా ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. ఇండియాలో ఉపాధి వీసాలను (Employement Visa) ఆమోదించడానికి ముందు ప్రొఫెషన్ టెస్టు నిర్వహించడం ప్రారంభించింది. స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ (Skill Verification Program) పరీక్షగా పిలువబడే ఇది మొదటి దశలో కొన్ని కేటగిరీల ఉద్యోగాలకు తప్పనిసరి. అలాగే క్రమంగా దీన్ని ఇతర అన్ని ఉద్యోగాలకు కూడా విస్తరించాలని సౌదీ భావిస్తోంది.

2021లో ప్రారంభించబడిన సౌదీ స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రొఫెషనల్ మ్యాన్‌పవర్ నాణ్యతను మెరుగుపరచడం, అర్హత లేని ఉద్యోగులను దేశంలో పని చేయకుండా నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సౌదీలో ఇప్పటికే పని చేస్తున్న లేదా పని చేయడానికి ప్లాన్ చేస్తున్న ప్రొఫెషనల్ కార్మికులు రిటైన్ (Written), ప్రాక్టికల్ పరీక్షలు రాయాలని ఈ ప్రోగ్రామ్ నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా కింద పేర్కొన్న 19 ప్రొఫెషనల్ పోస్టులకు ఈ స్కిల్ టెస్ట్ (Skill Test) అనేది తప్పనిసరి.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

1. బిల్డింగ్ ఎలక్ట్రీషియన్, 2. ప్లంబర్, 3. పైప్ ఫిట్టర్, 4. ఆటోమోటివ్ ఎలక్ట్రీషియన్, 5. వెల్డర్, 6. నీటి అడుగున వెల్డర్, 7. ఫ్లేమ్ కట్టర్, 8. డ్రిల్లింగ్ రిగ్ ఎలక్ట్రీషియన్, 9. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ అసెంబ్లర్, 10. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ అసెంబ్లర్, 11. ఎలక్ట్రికల్ ప్యానెల్ అసెంబ్లర్, 12. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ అసెంబ్లర్, 13. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ వర్కర్, 14. ఎలక్ట్రికల్ కేబుల్ కనెక్టర్, 15. ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ వర్కర్, 16. ఎలక్ట్రానిక్ స్విచ్ బోర్డ్ అసెంబ్లర్, 17. బ్లాక్ స్మిత్, 18. శీతలీకరణ సామగ్రి అసెంబ్లర్, 19. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్.

Midday break: యూఏఈ, ఖతార్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం వేళ పనికి బ్రేక్!


Updated Date - 2023-06-02T08:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising