ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: డొమెస్టిక్ వర్కర్ల రిక్రూట్‌మెంట్ వ్యయం.. సౌదీ సంచలన నిర్ణయం..!

ABN, First Publish Date - 2023-03-02T10:37:46+05:30

డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) నియామకాలకు సంబంధించి సౌదీ అరేబియా (Saudi Arabia) మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Social Developments) తాజాగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రియాద్: డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) నియామకాలకు సంబంధించి సౌదీ అరేబియా (Saudi Arabia) మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Social Developments) తాజాగా కీలక ప్రకటన చేసింది. రిక్రూట్‌మెంట్ వ్యయానికి సంబంధించి దేశాల వారీగా ఎగువ పరిమితిని నిర్ణయించింది. దీనిలో భాగంగా బూరండీ నుంచి గృహకార్మికులను నియమించుకోవాలంటే అత్యధిక వ్యయం 7,500 సౌదీ రియాళ్లుగా (రూ. 1.64లక్షలు) నిర్ణయించింది. ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్‌లో డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవడంతో బ్రోకరేజ్ సర్వీసులను అందించే అన్ని లైసెన్స్ రిక్రూటర్లు తమ ఆదేశాలను పాటించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది రిక్రూట్‌మెంట్ మార్కెట్‌లో విధానాలు, ధరల నియంత్రణ కోసం మంత్రిత్వశాఖ చేస్తున్న ప్రయత్నాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తుందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

బూరండీ మాదిరిగానే మరికొన్ని దేశాల వారికి రిక్రూట్‌మెంట్ ఖర్చులకు సంబంధించి ఎగువ సీలింగ్‌ను మంత్రిత్వశాఖ నిర్ణయించడం జరిగింది. ఉగాండా(రూ. 2.08లక్షలు), థాయ్‌లాండ్ (రూ. 2.21లక్షలు), కెన్యా (రూ. 2.38లక్షలు), బంగ్లాదేశ్ (రూ. 2.85లక్షలు), ఫిలిప్పీన్స్ (రూ. 3.79లక్షలు), శ్రీలంక (రూ. 3.29లక్షలు). వీటికి వ్యాట్ (VAT) అదనం అని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక ఈ నిర్ణయం అన్ని సేవలను అభివృద్ధి చేయడం, కార్మిక మార్కెట్‌ను మెరుగుపరిచి ప్రపంచ కార్మిక మార్కెట్‌లకు అనుగుణంగా తీసుకురావడంలో ఎంహెచ్ఆర్ఎస్‌డీ (MHRSD) ప్రయత్నాలకు బలం చేకూర్చుతుందని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

Updated Date - 2023-03-02T10:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!