Saudi Arabia: ప్రవాసులు, నివాసితులకు సౌదీ వార్నింగ్.. పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు..!
ABN, First Publish Date - 2023-08-19T10:21:20+05:30
గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది.
రియాద్: గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. లేనిపక్షంలో మనం తెలియకుండా చేసే పొరపాటు కూడా మనల్ని భారీ మూల్యం చెల్లించేకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మెడిసిన్స్ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియా (Saudi Arabia) పబ్లిక్ ప్రాసిక్యూషన్ కీలక సూచన చేసింది. అక్రమ రవాణా లేదా ప్రమోషన్ కోసం ఎవరైనా నివాసితులు, ప్రవాసులు మాదక ద్రవ్యాలను (Narcotics) కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) హెచ్చరించింది. సరైన అనుమతి లేకుండా, ట్రాఫికింగ్, ప్రమోషన్ లేదా వ్యక్తిగత ఉపయోగం ఉద్దేశం లేకుండా మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న, వాటిని రవాణా చేసేవారితో పాటు వాటిని అప్పగించే లేదా స్వీకరించే ఇలా ఎవరైనా శిక్షార్హులని పేర్కొంది. నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణ చట్టంలోని ఆర్టికల్ 39 ప్రకారం నిందితులకు ఐదేళ్ల వరకు జైలు, 30వేల సౌదీ రియాల్ (రూ.1.31లక్షలు) జరిమానా ఉంటుందని వార్న్ చేసింది.
UAE: యూఏఈలో దీర్ఘకాలం గడపాలనుకునే వారికి 3 నెలల విజిట్ వీసా భేష్.. ఎవరు అర్హులంటే..
Updated Date - 2023-08-19T10:22:22+05:30 IST