ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Islamic New Year: హిజ్రీ న్యూఇయర్‌కు షార్జాలో ఎన్ని రోజుల సెలవులంటే..

ABN, First Publish Date - 2023-07-14T10:43:24+05:30

హిజ్రీ న్యూఇయర్‌- 2023 (Hijri year-2023) సందర్భంగా షార్జా ప్రభుత్వం (Sharjah Govt) పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు అధికారిక సెలవులను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Islamic New Year: హిజ్రీ న్యూఇయర్‌- 2023 (Hijri year-2023) సందర్భంగా షార్జా ప్రభుత్వం (Sharjah Govt) పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు అధికారిక సెలవులను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులపాటు ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది. తిరిగి 24న (సోమవారం) యధావిధిగా కార్యాలయాలు తెరచుకుంటాయని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. ఈ మేరకు షార్జాలోని మానవ వనరుల డైరెక్టరేట్ (Directorate of Human Resources in Sharjah) తాజాగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా డైరెక్టరేట్.. యూఏఈ (UAE) నాయకత్వానికి, ప్రజలకు, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల ప్రజలకు తన అభినందనలు (Congratulations) తెలియజేసింది. అటు దుబాయిలో కూడా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు అక్కడి గవర్నమెంట్ జూలై 21న (శుక్రవారం) పెయిడ్ లీవ్ ప్రకటించింది.

కువైత్‌లో కూడా 4రోజుల సెలవులు..

కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) సైతం ఇస్లామిక్ న్యూఇయర్ (Islamic New Year) సందర్భంగా 4రోజుల సెలవులు ప్రకటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకు దేశ వ్యాప్తంగా నాలుగు రోజులు సెలవులు (Holidays) వచ్చాయి. హిజ్రీ న్యూఇయర్‌ (Hijri New Year) అయిన జూలై 19 నుంచి 22వ తేదీ వరకు వరుసగా 4రోజులు సెలవులు ప్రకటించింది మంత్రిమండలి. 20న రెస్ట్ ఆఫ్ డే కాగా, శుక్ర, శనివారం అక్కడ వీకెండ్ ఉంటుంది. ఇలా కువైత్ వాసులకు న్యూయర్ సందర్భంగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ (Long Weekend) వచ్చింది. అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. తిరిగి 23వ తేదీన యధావిధిగా అన్ని కార్యాలయాలు తెరచుకుంటాయి. ఇక ఈ ఏడాది రంజాన్, బక్రీద్ తర్వాత మరో లాంగ్‌వీకెండ్ రావడంతో కువైత్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Visa Fees: బ్రిటన్‌ వెళ్లే విదేశీయులకు షాక్.. వీసా ఫీజులపై రిషి సునాక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated Date - 2023-07-14T10:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising