ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అమెరికాలో కలకలం.. 'ఇదే లాస్ట్ వార్నింగ్ .. చచ్చిపోతారు' అంటూ సిక్కు మేయర్‌ ఫ్యామిలీకి బెదిరింపులు

ABN, First Publish Date - 2023-10-19T08:51:11+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం హోబెకేన్ నగర (Hoboken city) మేయర్‌గా ఉన్న భారత సంతతి సిక్కు వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు చంపేస్తామంటూ బెదిరింపు ఇ-మెయిల్ పంపించడం కలకలం సృష్టిస్తోంది.

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం హోబెకేన్ నగర (Hoboken city) మేయర్‌గా ఉన్న భారత సంతతి సిక్కు వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు చంపేస్తామంటూ బెదిరింపు ఇ-మెయిల్ పంపించడం కలకలం సృష్టిస్తోంది. మేయర్‌ రవి భల్లా (Mayor Ravi Bhalla) ను వెంటనే పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అతనితో పాటు అతని ఫ్యామిలీని చంపేస్తామని దుండగులు ఆ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017 నవంబర్‌లో హోబోకెన్ సిటీకి మేయర్‌గా ఎన్నికైన తొలి సిక్కు వ్యక్తిగా రవి భల్లా చరిత్ర సృష్టించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ఇటీవల ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఏడాది క్రితం నుంచి తనకు బెదిరింపులు మొదలైనట్లు తెలిపారు. పదవికి రాజీనామా చేయాలని లేకుంటే చంపేస్తామని గుర్తుతెలియని దుండగులు హెచ్చరించినట్లు చెప్పారు.

అలా ఇప్పటి వరకు ఇ-మెయిల్ (e-mail) ద్వారా తనకు మూడు లేఖలు వచ్చాయని తెలిపారు. మొదటి రెండు లేఖలకు స్పందించకపోవడంతో మూడోసారి పంపిన లేఖలో తాను వెంటనే రాజీనామా చేయకుంటే తనను, తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారని మేయర్ చెప్పుకొచ్చారు. దుండగులకు తనతో పాటు తన ఫ్యామిలీపై కోపం, ద్వేషం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. తనతో పాటు తన పొరుగువారు, తన సోదరుడు, ఇతర సహచరులు కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని రవి భల్లా తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవి భల్లాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రతను పెంచారు. 24 గంటల పాటు భద్రతను అందిస్తున్నారు. ఈ క్రమంలో వీటికి బాధ్యులైన ఓ అనుమానిత వ్యక్తిని పట్టుకుని అభియోగాలు మోపామని పోలీసులు వెల్లడించారు. అయితే, బెదిరింపు లేఖల (Threatening Letters) వెనుక ఉన్న వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడని మేయర్ చెప్పారు.

నగరంలో ఎలాంటి ద్వేషానికి తావులేదని.. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా తాను బలంగా నిలబడతానని ఆయన పేర్కొన్నారు. సిక్కులు (Sikhs) పెద్ద సంఖ్యలో స్థిరపడిన హోబోకెన్ నగరాన్ని నడిపించడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్య, ప్రేమ ద్వారా ద్వేషాన్ని అంతం చేయవచ్చని రవి భల్లా తెలిపారు. ఇక 26ఏళ్ల వయసులో హోబోకెన్ సిటీకి వచ్చిన ఆయన.. లా చదివిన తర్వాత నెవార్క్‌లోని ఒక చిన్న న్యాయ సంస్థలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అనతికాలంలోనే అగ్రరాజ్యంలో ప్రముఖ పౌర హక్కుల న్యాయవాదిగా రవి భల్లా గుర్తింపు తెచ్చుకున్నారు. మేయర్ కావడానికి ముందు హోబోకెన్ సిటీ కౌన్సిల్‌లో ( Hoboken City Council) ఎనిమిదేళ్లు పని చేశారు.

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు

Updated Date - 2023-10-19T08:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising