ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonalu Festival 2023: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ

ABN, First Publish Date - 2023-07-11T08:39:37+05:30

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జూలై 9 (ఆదివారం) సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఆనంద ఉత్సవాలతో 500 మందికి పైగా భక్తులతో కన్నుల పండగగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bonalu Festival 2023: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జూలై 9 (ఆదివారం) సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఆనంద ఉత్సవాలతో 500 మందికి పైగా భక్తులతో కన్నుల పండగగా జరిగింది. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో డప్పు వంటి వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో పరిసరాలు మారుమోగడంతో కార్యక్రమం హోరెత్తింది. బోయిన స్వరూప, పెద్ది కవిత, కలకుంట్ల లావణ్య, వేముల సౌహన్య తదితరులు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. విలువైన ఆధ్యాత్మిక, సాంప్రదాయ ప్రాముఖ్యతను కలిగిన ఈ పండగ నిష్ఠతో అత్యంత భక్తితో నిర్వహించబడింది. సింగపూర్‌లో నివసించే అనేక మంది వారి కుటుంబ సమేతంగా పాల్గొనగా, అనేక మంది కార్మిక సోదరులు కూడా చురుకుగా పాల్గొన్నారు.

బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు తాము వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కూడిన బోనాన్ని ముగ్గు, పసుపులతో అలంకరించిన కొత్త మట్టి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, పోతురాజులు, ఆటగాళ్ళు తోడ్కొని వెళ్లారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచి నిష్ఠగా బోనాల్ని సమర్పించారు. మహిళలు, పిల్లలు అందరూ ఎలాంటి భేజషం లేకుండా నృత్యాలు చేశారు. తరవాత అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని సేవించారు. "పోతురాజు" యొక్క వేషధారణ, వారి ఆహార్యం, మనోహరమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచింది. ఎంతోమంది తెలుగు వారు తమ పిల్లలకి తెలుగు సాంప్ర దాయాన్ని, బోనాల విశిష్టతని చూపటానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ఉచిత బస్సుల్ని ఏర్పాటు చేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని, దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపడం పట్ల మరియు ఆయన బోనాల్ని సమర్పించిన మహిళల్ని, కమిటీ సభ్యుల్ని, కార్యక్రమ నిర్వాహకులు బోయిన సమ్మయ్యని అభినందించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా చూసేందుకు తమ విలువైన సహకారాన్ని అందించిన సభ్యులందరికీ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హాజరైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడంలో వారి కృషి, అంకితభావం కీలక పాత్ర పోషించాయని తెలిపారు.

Updated Date - 2023-07-11T08:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising