ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: 'దసరా కల్చరల్ నైట్-2023'కు సింగపూర్ తెలుగు సమాజం భారీ ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-10-25T09:54:06+05:30

ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలతో అలరించే సింగపూర్ తెలుగు సమాజం (STS) వారు ఈ సంవత్సరం దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమంతో ముందుకు వచ్చారు.

NRI: ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలతో అలరించే సింగపూర్ తెలుగు సమాజం (STS) వారు ఈ సంవత్సరం దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అక్టోబర్ 28వ తేది (శనివారం) సాయంత్రం గం౹౹ 3:00 ని౹౹ నుండి నాన్యంగ్ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత తెలుగు యాంకర్ సుమ కనకాల మొట్టమొదటిసారిగా సింగపూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆద్యంతం చాలా ఉత్సాహభరితంగా ఉండబోతుందని కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. ఇంకా ప్రఖ్యాత జబరదస్త్ కళాకారులు బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్, బిగ్ బాస్ ఫేమ్ ఫైమాతో కలసి హాస్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రముఖ ఇల్యూజనిస్ట్, India's Got Talent Gand Finalist, బి యస్ రెడ్డితో కార్యక్రమం మరింత సందడిగా ఉంటుందని STS అధ్యక్షులు బొమ్మారెడ్డి మీడియాకు తెలియజేశారు.

తెలుగు వారి పెద్ద పండుగులలో ఒకటైన ఈ విజయదశమి పండుగును పిల్లలు,పెద్దలతో కేరింతల నడుమ జరుపుకోవటానికి మొట్టమొదటిసారిగా ఢీ జోడి విజేత సంకేత్, నైనికలతో డాన్స్ కూడా ఏర్పాటు చేసామని కార్యదర్శి పోలిశెట్టి అనిల్ ఈ సందర్భంగా తెలిపారు. సంపంగి డెవలపర్స్, జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రధాన స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ ఈవెంట్‌కు జె మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్ పార్టనర్‌గా, జానిక్, ప్రాప్నెక్స్ కుమార్, రమేష్ వంటి అనేకమంది స్పాన్సర్స్‌గా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్స్.. బుక్ మై షో ద్వారా శరవేగంగా బుక్ అవుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండాలని ఆరు కేటగిరీలలో (VIP, Platinum, Diamond, Gold, Silver, and Balcony) టికెట్ల విక్రయం జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఈవెంట్‌లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రధాన కార్యవర్గం కోరింది.

Updated Date - 2023-10-25T09:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising