NRI: కొలువుదీరిన సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం
ABN, First Publish Date - 2023-04-23T07:37:47+05:30
సింగపూర్ తెలుగు సమాజం సర్వసభ్య సమావేశం-2022 సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికలు 2023 మార్చి 5వ తేదీన (2023-2025 గాను) ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరిగాయి.
సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం సర్వసభ్య సమావేశం-2022 సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికలు 2023 మార్చి 5వ తేదీన (2023-2025 గాను) ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరిగాయి. జురాంగ్‌లో దేవన్ నాయర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయిబిలిటీ ప్రాంగణంలో ఎన్నికలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో నిర్వహించిన పలు విభిన్న కార్యక్రమాలు, ఇరత భారీ స్ధాయి కార్యక్రమాలతో పాటు కోవిడ్ సమయంలో నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలు సింగపూర్లో నివసించే తెలుగువారితో పాటు పలు ఇతర సంస్ధలు, ప్రభుత్వ శాఖల దృష్టిని ఆకర్షించారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్ధల గుర్తింపుతో పాటు మార్గదర్శకంగా నిలిచాయి. దీనికి ప్రతిస్పందనగా సింగపూర్‌లో నివసించే తెలుగువారిలో సుమారు 8000 మంది సభ్యత్వం తీసుకొని ఉత్సాహంగా తమ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ముందుకువచ్చారు. ఈక్రమంలోనే గరిష్ఠంగా ఈసారి నలుగురు ఔత్సాహికులు అధ్యక్షులుగా రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నామినేషన్స్ ఉపసంవరణ పక్రియ అనంతరం 51 మంది వివిధ కార్యవర్గ స్ధానాలకు సంబంధించి ఎన్నికల బరిలో నిలిచారు.
నవంబరు 6న జరిగిన సర్వసభ్యసమావేశం నిర్ణయం మేరకు డిశంబరు 31 తేదీలోపు బకాయిలు లేకుండా క్రియాశీలకంగా ఉన్న 8,994 మందిని ఎన్నికలలో పాల్గొనగలిగిన సభ్యులుగా గుర్తించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనే సత్సంకల్పంతో సర్వసభ్యసమావేశం సూచన మేరకు తెలుగు సమాజ వ్యవస్ధలో భాగం కాని మూడవ పక్షానికి చెందిన తంగవేలు అన్బళగన్‌ను ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించారు. సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో విశేష అనుభవం, ఇంతకముందు 30,000 మంది వరకు పాల్గొన్న వివిధ కార్యక్రమాల నిర్వహణ తంగవేలు అన్బళగన్ సొంతం. ఇవన్నీ ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, సులభంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో దోహదపడ్డాయి. ఆయన బృందం శక్తివంచన లేకుండా చక్కగా తమ బాధ్యతను విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందింది.
ఎన్నికలలో 4,986 పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికలలో నిలబడిన వారి సమక్షంలో జరిగిన లెక్కింపు అనంతరం ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇటీవల ప్రకటించబడ్డాయి. ఈ ఫలితాల ప్రకారం సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ ఎన్నికల్లో బొమ్మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి నూతన అధ్యక్షుడిగా, అతని బృందం చారిత్రాత్మకమైన విజయం సాధించింది. సర్వసభ్య సమావేశం ఛైర్మన్ కోటిరెడ్డి విజేతలను ప్రకటించి వారికి శుభాకాంక్షలు తెలుయజేసారు. నూతన కార్యవర్గం ఏప్రిల్ 1వ తేదీ నుండి బాధ్యతలను స్వీకరించిందని అప్పటి గౌరవ కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు.
నూతన కార్యవర్గం:-
అధ్యక్షులు- బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి
గౌరవ కార్యదర్శి- పోలిశెట్టి అనిల్ కుమార్
గౌరవ కోశాధికారి- బచ్చు ప్రసాద్
ఉపాధ్యక్షులు- కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి, పాలెపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి, టేకూరి నగేష్
నిర్వహణ కార్యదర్శి- కురిచేటి స్వాతి
సహాయ కోశాధికారి- జూనెబోయిన అర్జునరావు
ప్రాంతీయ కార్యదర్శులు- బోయిని సమ్మయ్య, కలిదిండి ఫణీంద్ర వర్మ, మేరువ కాశి రెడ్డి, మ్రితివాడ రాంరెడ్డి
కమిటీ సభ్యులు- బద్దం జితేందర్ రెడ్డి, బాలగా రమణారావు,బండ్ర శేషగిరి, గాడిపల్లి చంద్రమౌళి, గుజ్జుల శ్రీలక్ష్మి, కొత్తా సుప్రియ, రాపేటి జనార్ధనరావు, స్వామి గోపి కిషోర్, వైద మహేష్, ఎఱ్ఱాప్రగడ చాణక్య
గౌరవ ఆడిటర్లు- ఆలపాటి వెంకట రాఘవ రావు, రొడ్డా సతీష్ బాబు
నూతన అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. అనాదిగా పూర్వకార్యవర్గాలు నిర్వహించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ అందరినీ కలుపుకొని మరిన్ని వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూ సమాజాన్ని మరింత ప్రగతిపథంలోకి తీసుకొనివెళ్ళేట్లుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గం మొదటి కార్యవర్గ సమావేశం ఏప్రిల్ 21వ తేదీన జరిగిందని, మొదటి కార్యక్రమంగా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నామని నూతన గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2023-04-23T07:37:47+05:30 IST