GCC: జీసీసీ దేశాల నివాసితులకు ఇక ఆ సమస్య లేనట్టే.. అతి త్వరలో కొత్త వీసా విధానం!
ABN, First Publish Date - 2023-09-27T11:01:56+05:30
ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా 'ఒకే వీసా' (Single visa) విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ (UAE) మంత్రి ఒకరు తెలిపారు. ఆ దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రిని ఉటంకిస్తూ అతి త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చని చెప్పారని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
GCC: ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా 'ఒకే వీసా' (Single visa) విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ (UAE) మంత్రి ఒకరు తెలిపారు. ఆ దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రిని ఉటంకిస్తూ అతి త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చని చెప్పారని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుతం జీసీసీ (GCC) దేశాల పౌరులకు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఖతార్‌కు వీసా ఫ్రీ-ట్రావెల్ (visa-free travel) సౌకర్యం ఉంది.
ఇక ఈ దేశాల్లో ఉంటున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. కొన్ని దేశాల వారికి మాత్రం వీసా ఆన్ అరైవల్ వెసులుబాటు ఉంది. ఒకవేళ ఈ సింగిల్ వీసా విధానం అమలులోకి వస్తే మాత్రం ప్రవాసులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. మంగళవారం అబుదాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్‌లో అల్ మర్రి పాన్-జీసీసీ సింగిల్ వీసా గురించి మాట్లాడారు.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో బహ్రెయిన్ పర్యాటక మంత్రి ఫాతిమా అల్ సైరాఫీ తమ దేశానికి వచ్చే సందర్శుల కోసం జీసీసీ-వ్యాప్త 'స్కెంజెన్-శైలి' వీసా కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అరేబియా ట్రావెల్ మార్కెట్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏకీకృత వీసాను అమలు చేసేందుకు మంత్రివర్గం స్థాయి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యవస్థ అతి త్వరలో ప్రారంభించబడుతుందని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యూఏఈ (UAE) ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఒక ఏకీకృత ప్యాకేజీ కింద పరిమితులు లేకుండా అనేక దేశాలను సందర్శించడానికి ఈ వ్యవస్థ పర్యాటకులకు బాగా సహాయపడుతుందని పేర్కొన్నారు.
Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..
Updated Date - 2023-09-27T11:01:56+05:30 IST