ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget 2023: ఇక ఈ-పాస్‌పోర్టులు వేగవంతం.. తాజా బడ్జెట్‌లో భారీ కేటాయింపు

ABN, First Publish Date - 2023-02-02T07:43:23+05:30

బయోమెట్రిక్ ఆధారిత పాస్ పోర్టుల జారీగా కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీ-20 నిర్వహణకు 990 కోట్లు

గల్ఫ్‌లో నిర్భయ సెంటర్లకు నిర్ణయం

ఆఫ్రీకాలో చైనాను అడ్డుకట్ట వేయడానికి శూన్యం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బయోమెట్రిక్ ఆధారిత పాస్ పోర్టుల జారీగా కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తుంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-పాస్‌పోర్టుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి తాజాగా బడ్జెటులో రూ.1002.78 కోట్లు కేటాయించారు. దశల వారీగా చిప్ అమర్చబడి ఉండే ఈ-పాస్‌పోర్టుల జారీ కోసం కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. అదే విధంగా విదేశాలలో ప్రత్యేకించి గల్ఫ్ దేశాల నుండి యజమానుల ద్వారా ఉద్యోగ హామీ, ఒప్పంద పత్రాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో అమలు చేయడానికి కూడా నూతన పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు.

జీ-20 అధ్యక్ష స్ధానంలో ఉండి విశ్వ గురువుగా వెలుగాలని చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రూ. 990 కోట్లు కేటాయించింది. జీ-20కి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరులోపు 200 సమావేశాలు నిర్వహించనుంది. ఇక 2023-24 బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.18,050 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.800 కోట్లు ఎక్కువ. అయినా క్షిణించిన రూపాయితో పెరిగిన డాలర్ ధర మరియు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సు దృష్ట్యా ఇది ఏ మాత్రం సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో పెరిగిపోతున్న చైనా దౌత్య ప్రాబల్యం దృష్ట్యా భారత్ కూడా ఆఫ్రికా ఖండంలో ఉనికి పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా నూతన ఎంబసీలను నెలకోల్పడానికి ఏలాంటి కేటాయింపులు జరుగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా విస్తర్ణ కొరకు ప్రయత్నిస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇంకా 48 దేశాలలో భారతీయ ఎంబసీలు లేవు.

అదే విధంగా విదేశాలకు సహాయం క్రింద ఇచ్చే గ్రాంట్లలో కూడా పెద్దగా మార్పు ఏమి లేదు. విదేశాలకు సహాయం చేయడానికి రూ.5848 కోట్లు కేటాయించారు. భారత వాగ్దానాలు, పలుకుబడితో చూస్తే ఈ కేటాయింపు అంతంత మాత్రమే. ఇక ప్రవాసీయుల సంక్షేమానికి వచ్చేసరికి ఒక్క దుబాయి మినహా సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ, కెనడా, సింగాపూర్ దేశాలలో కష్టాలలో ఉన్న భారతీయ మహిళలకు సహాయం అందించడానికి వన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలను నెలకోల్పడానికి రూ.7 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పలుకుడిని పెంచడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయింపులను రెండింతలు పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం, ఇతర వర్గాలు కోరినా కేంద్రం పెడచెవిన పెట్టింది.

Updated Date - 2023-02-02T07:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising