Sri Lanka: శ్రీలంక వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!
ABN, First Publish Date - 2023-10-25T09:21:20+05:30
పర్యాటక రంగాన్ని (Tourism industry) మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక (Sri lanka) సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
కొలంబో: శ్రీలంక వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..! పర్యాటక రంగాన్ని (Tourism industry) మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక (Sri lanka) సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా శ్రీలంక వీసా-ఫ్రీ ట్రావెల్ (Visa-free travel) అకాశం కల్పించిన ఏడు దేశాల జాబితాలో భారత్‌తో పాటు చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయోగాత్మకంగా (Pilot project) దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీలంక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలీ సబ్రీ 'ఎక్స్' (ట్విటర్) ద్వారా తెలియజేశారు. అలాగే వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..
ఇక ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అనే విషయం తెలిసిందే. దీంతో తాజాగా తీసుకున్న ఏడు దేశాల పర్యాటకులకు వీసా అక్కర్లేని విజిట్ నిర్ణయం అనేది రాబోయే కాలంలో శ్రీలంకకు వచ్చే సందర్శకుల సంఖ్యను ఏకంగా 50 లక్షలకు పెంచుతుందని అంచనా వేస్తోంది. ఇక కరోనాకు తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొంతకాలంగా శ్రీలంకకు పర్యాటకుల తాకిడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి తిరిగి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీలంక సర్కార్ ఇప్పుడు ఈ వీసా ఫ్రీ-ట్రావెల్‌ను తీసుకొచ్చింది.
Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్
Updated Date - 2023-10-25T11:30:12+05:30 IST