ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎస్ అధికారి కూతురి డెత్ మిస్టరీ.. 3 వారాల క్రితమే అమెరికాకు వెళ్లిన 23 ఏళ్ల యువతి.. బర్త్‌డే కూడా ఘనంగా చేసుకుంది కానీ..

ABN, First Publish Date - 2023-03-30T10:26:21+05:30

న్యూయార్క్‌లో ఓ ప్రముఖ ఐపీఎస్ కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన (Suspected Death) ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లో ఓ ప్రముఖ ఐపీఎస్ కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన (Suspected Death) ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అందులోనూ ఆమె మూడు వారాల క్రితమే ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా (America) వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినీతా ఠాకూర్ (Vinita Thakur). ఆమె కూతురు వసుధ ఠాకూర్ (Vasudha Thakur) మూడు వారాల క్రితం మేనేజ్‌మెంట్ కోర్సు కోసం న్యూయార్క్ (New York) వెళ్లారు. అయితే, మూడు రోజుల క్రితం ఆమె అనుమానాస్పద స్థితిలో (Suspicious Circumstances) మృతిచెంది కనిపించింది. వసుధ సూసైడ్ చేసుకుందని ప్రాథమిక సమాచారం. కానీ, ఆమె చనిపోయిన తీరు మాత్రం పలు అనుమానాలు కలిగిస్తుంది. బుధవారం వసుధ మృతదేహం యూఎస్ నుంచి జైపూర్‌కు చేరింది. అయితే, ఇప్పటికీ ఆమె డెత్ మిస్టరీ వీడలేదు. ఇక వినీతా భర్త విక్రమ్ ఠాకూర్ కూడా ఐపీఎస్ అధికారియే. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని ఇంటిలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau Delhi) జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

3వారాల క్రితమే ఘనంగా 23వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆ తర్వాత న్యూయార్క్‌కు...

మూడు వారాల క్రితం జైపూర్‌లో (Jaipur) 23వ బర్త్‌డేను వసుధ తన తల్లి వీనితా, చెల్లితో కలిసి ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఆ తర్వాతి రోజు అమెరికా వెళ్లిపోయింది. అలా మూడు వారాలు గడిచిపోయాయి. ఇంతలోనే వసుధ చనిపోయినట్లు వినీతకు సమాచారం అందడంతో ఆమె హతాశురాలైంది. వెళ్లేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్లిన కూతురు ఇలా విగతజీవిగా తిరిగి రావడం ఐపీఎస్ కపుల్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఇంత చిన్న వయసులో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లడం వెనుక ఉన్న కారణమెంటో వారికి తెలియడం లేదు.

ఇది కూడా చదవండి: ఇండియాలో బాగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. ఇక అమెరికా వీసా చాలా ఈజీ!

ఇక వసుధ పాఠశాల విద్య ఢిల్లీలోని సంస్కృతి పాఠశాలలో (Sanskriti School) పూర్తి చేసింది. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్ కోసం విశ్వవిద్యాలయంలో ఎంపికైంది. దీనిలో భాగంగా ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తోంది. వసుధ చదువులో ఎప్పుడూ చాలా చురుకుగా ఉండేదట. వసుధ తండ్రి విక్రమ్ ఠాకూర్ యూపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అయిన వినీతా ఠాకూర్‌ను వివాహం చేసుకున్నప్పటికీ విక్రమ్ సింగ్ తన క్యాడర్‌ను మార్చుకోలేదు. ఇప్పుడు పెద్ద కూతురు మృతితో ఈ ఐపీఎస్ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇది కూడా చదవండి: ఫోన్ స్క్రీన్ లాక్‌తో వచ్చిన తంటా.. సరియైన గుర్తింపు లేని కారణంగా 7 నెలలుగా ఎడారిలో తెలుగు ప్రవాసీ మృతదేహాం

Updated Date - 2023-03-30T11:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising