ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: 14వేల మంది భారతీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించిన స్విట్జర్లాండ్..!

ABN, First Publish Date - 2023-08-06T11:03:02+05:30

స్విట్జర్లాండ్ గతేడాది భారతీయులకు సంబంధించిన వీసా దరఖాస్తులను (Visa Applications) భారీ మొత్తంలో తిరస్కరించిన విషయం తాజాగా వెలువడిన స్కెంజెన్ గణాంకాల (Schengen Statics) ద్వారా తెలిసింది.

ఎన్నారై డెస్క్: స్విట్జర్లాండ్ గతేడాది భారతీయులకు సంబంధించిన వీసా దరఖాస్తులను (Visa Applications) భారీ మొత్తంలో తిరస్కరించిన విషయం తాజాగా వెలువడిన స్కెంజెన్ గణాంకాల (Schengen Statics) ద్వారా తెలిసింది. 2022లో భారతీయులకు (Indians) చెందిన 13.2 శాతం వీసా అప్లికేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి. అలాగే 1,06,025 దరఖాస్తులు ఆమోదం పొందినట్లు సమాచారం. ఇక వీసా దరఖాస్తులు రిజెక్ట్ అయిన దేశాలవారీగా చూసుకుంటే భారత్ 30వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దాయాది పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. పాకిస్థానీలకు సంబంధించిన దరఖాస్తుల్లో ఏకంగా 55.1 శాతం తిరస్కరణకు గురయ్యాయి. పాక్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఘనా (46.5 శాతం), కాంగో (41.5 శాతం), అల్జీరియా (39.9 శాతం), అర్జెంటీనా (35 శాతం) ఉన్నాయి.

కాగా, 2019తో పోలిస్తే 2023లో ఇప్పటివరకు స్వీస్ అత్యధిక వీసాలను భారతీయులకు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.29లక్షల దరఖాస్తులను పరిశీలించింది. మహమ్మారి కరోనా ముందుతో పోలిస్తే 7.8 శాతం ఎక్కువ వీసాలను జారీ చేసింది. భారతీయుల వీసాల ప్రక్రియను 2023లో మరింత సులభతరం చేయడానికి ఇండియాలోని స్విట్జర్లాండ్ ఎంబసీ (Switzerland Embassy) కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ప్రయాణానికి 6 నెలల ముందే వీసా (Visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు కేవలం నెల ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండేది. ఈ నిర్ణయం ఇప్పుడు భారత టూరిస్టులకు (Indian Tourists) ఎంతో ఉపయోగకరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Big Ticket: బర్త్‌డే నాడు కొన్న లాటరీ టికెట్.. దుబాయిలోని భారత ప్రవాసుడికి కోట్లు తెచ్చిపెట్టింది!


Updated Date - 2023-08-06T11:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising