ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TAMA: 'తామా' ఎడ్యుకేషన్ సెమినార్‌కు అనూహ్య స్పందన

ABN, First Publish Date - 2023-08-02T13:53:19+05:30

'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్‌కు విశేష స్పందన లభించింది. తామా వారి కార్యక్రమాలలో ఇది మరో కలికితురాయిగా చేరింది.

భారీగా హాజరైన అట్లాంటా వాసులు

TAMA: 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్‌కు విశేష స్పందన లభించింది. తామా వారి కార్యక్రమాలలో ఇది మరో కలికితురాయిగా చేరింది. స్థానిక కమ్మింగ్‌లోని షారన్ కమ్యూనిటీ భవనంలో శనివారం, జూలై 22న నిర్వహించిన ఒక ప్రత్యేక, ఉపయోగకరమైన విద్యా సెమినార్ లో 200 మందికి పైగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరు కావడంతో నిర్వాహకులు నేలపై టార్పాలిన్ పట్టాలు వేసి విద్యార్థులు కూర్చోవాలని కోరారు. చాలా మంది నిలబడి మరీ విన్నారు. విద్య అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, విద్యా నిపుణురాలు డాక్టర్ వాణి గడ్డం చేసిన ఈ వివరణాత్మక సెమినార్ ద్వారా హాజరైన వారికి ఎన్నో మంచి విషయాలు తెలియటమే కాకుండా, సరైన మార్గంలో వెళ్ళడానికి కూడా సహాయపడుతుంది. ఇది 2023లో తామా వారి 16వ కార్యక్రమం, క్లుప్త వేసవి విరామం తర్వాత మొదటిది. ముఖ్యమైన విషయాలను విపులీకరిస్తూ, పరస్పర సంభాషణలతో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా జరిగింది.

స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఎంతో ఆసక్తిగా పాల్గొని, చివరి వరకు ఉండి, అనేక ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విచ్చేసిన వారు తామా ని అభినందించి, ఇలాంటి మరెన్నో చేయాలని విజ్ఞప్తి చేశారు. తామా బహుముఖ మరియు అన్ని వయసుల వారికి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తోంది. రాబోయే ఈవెంట్ ఆగస్టు 13న ‘తామా వీక్లీ ఫ్రీ క్లినిక్ వాక్’, తదుపరి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. మరిన్ని వివరములకు www.tama.org ని సందర్శించండి లేదా info@tama.org కి ఇమెయిల్ పంపండి.

అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి అందరికీ స్వాగతం పలికి, డాక్టర్ వాణి ని వేదికపైకి ఆహ్వానించారు. ఉపాధ్యక్షులు సురేష్ బండారు ఆమెను సభకు పరిచయం చేశారు. కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు అవకాశాలు, నాయకత్వ లక్షణాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ పర్స్యూట్స్, రీసెర్చ్ మరియు ఇంటర్న్‌షిప్ ఆప్షన్‌ల వరకు ఆమె అనర్గళంగా విశదీకరించారు. ఎస్ ఏ టి, ఏ సి టి మొదలైన ప్రామాణిక పరీక్షలు, ఏ పి, ఐ బి, డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ & కాలేజీ ఎంపికల వివరాలు ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ ఆమె స్పృశించిన మరో ఆసక్తికరమైన అంశం. ఈ సెమినార్ వల్ల ఎన్నో ప్రయోజనకర విషయాలు తెలుసుకోవడం వలన, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చదువు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తామా బృందం డాక్టర్ వాణి ని శాలువా మరియు ఫలకం తో సత్కరించి, ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిర్వాహకులు హాజరైన వారందరికీ అల్పాహారం మరియు పానీయాలు అందజేశారు.

సాయిరామ్ దీర్ఘకాలంగా ఉన్న స్పాన్సర్లు మరియు మద్దతుదారులను వేదిక మీదకు పిలిచి, వారు చేసే పనుల గురించి మాట్లాడమని కోరారు. వీలైనప్పుడల్లా వారికి ప్రయోజనకారిగా ఉండాలని తామా వారు ఎప్పుడూ అభిలషించడం స్వాగతించాల్సిన చర్య. అలానే, తామా చేస్తున్న వివిధ కార్యక్రమాలు, వాటి ఉపయోగాలను ఆయన వివరించారు. వీక్లీ తామా ఫ్రీ క్లినిక్ గురించి చైర్మన్ సుబ్బారావు మద్దాళి మాట్లాడి, ప్రయోజనాలను వివరించి, సేవలను వినియోగించుకోవాలని కోరారు. మీడియా సెక్రటరీ శ్రీనివాస్ రామిశెట్టి ఈ విశేష కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. తామా టీమ్‌ ప్రియాంక గడ్డం, రాఘవ తడవర్తి, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, కృష్ణ ఇనపకుతిక, తిరు చిల్లపల్లి, శశి దగ్గుల, హర్ష కొప్పుల, శ్రీనివాస్ ఉప్పు, పవన్ దేవలపల్లి, కమల్ సాతులూరు, రాజేష్ జంపాల సెమినార్ సజావుగా సాగేందుకు సహకరించారు. సంగోష్టి విజయవంతం చేసినందుకు సమర్పకులకు, సభికులకు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సురేష్ కార్యక్రమాన్ని ముగించారు.

Updated Date - 2023-08-02T13:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising