ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TAUK: లండన్‌లో ఘనంగా 'టాక్' అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2023-03-17T10:13:19+05:30

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను (International Women's Day Celebrations) ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నేడు అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు: టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి

లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను (International Women's Day Celebrations) ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమారు రెండు వందలకు పైగా మహిళలు వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ మహిళా నాయకత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి, సంస్థ చేపడుతున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలను సభకు వివరించారు. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు.

ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలనీ పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని తెలిపారు. స్థానికంగా మన స్వదేశం నుండి వచ్చిన మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మన బతుకమ్మ, బోనంను విదేశీ గడ్డపై ఎత్తుకొని మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న ప్రవాస మహిళలందరిని అభినందిస్తూ, ధన్యవాదాలు తెలిపారు. మన తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత స్ఫూర్తితో మేమంతా ముందుకు వెళ్తున్నామని, అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ ముందుకు నడిపిస్తునందుకు కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయ్యడానికి కొన్ని వారాల నుండి కష్టపడి పని చేసిన 'టాక్' మహిళా ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల నిర్వాహణలో ఎంతో సహకరించి ప్రోత్సహించిన టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ మహిళా విభాగం కార్యదర్శి క్రాంతి రేతినేని మాట్లాడుతూ.. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఒకేచోటు చేరి మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషాన్ని, నూతన స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ వేడుకలు ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి కృషి, ఇతర మహిళా సభ్యుల సహాకారం, ముఖ్యంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం గారి మరియు అధ్యక్షుడు రత్నాకర్ గారి ప్రోత్సాహమని వారందరిని ప్రశంసించారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేకించి మహిళల సంరక్షణ కొరకు, వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నారని కొనియాడారు. స్థానిక సంస్థలల్లో మహిళా కోటా తెచ్చి మహిళలను మేయర్లని, మున్సిపల్ ఛైర్పర్సన్లను చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసలు కురిపించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం మహిళా సాధికారతలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని క్రాంతి రేతినేని పేర్కొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, హాజరై టాక్ సంస్థను ప్రోత్సహించిన అతిధులకు కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచం అంతా జరుపుకునేదిగా అభివర్ణించారు. టాక్ సంస్థలో ప్రవాస మహిళలంతా భాస్వాములు కావాలని, మనమంతా కలిసి ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేయ్యొచ్చని స్వాతి తెలిపారు.

ఎన్నో రకాల ఆటలు, గెలిచిన వారికి బహుమతులు, మహిళలంతా ఇంటి నుండి తీసుకొచ్చిన వివిధ రకాల వంటలను ఒకరికొకరితో పంచుకొని రోజంతా సరదాగా గడిపారు. టాక్ మహిళా సెల్ నాయకురాలు శ్వేతా మహేందర్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డితో పాటు క్రాంతి, సుప్రజ, స్వాతి, విజిత, పావని రత్నాకర్, మౌనిక, శ్వేతా, స్నేహ, ఉమా గణేష్, శ్రీ లక్ష్మి రాకేష్, హారిక, మమతా, నంతిని, దీపాక్షర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T10:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising