ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Origin: అగ్రరాజ్యంలో ఘోరం.. భారత యువకుడిని కాల్చి చంపిన అమెరికన్ టీనేజర్!

ABN, First Publish Date - 2023-07-02T12:14:58+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఓ అమెరికన్ టీనేజర్ భారత యువకుడిని కాల్చి చంపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఓ అమెరికన్ టీనేజర్ భారత యువకుడిని కాల్చి చంపాడు. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కౌంటీ (San Bernardino County) పరిధిలోని హెస్పెరియాలో (Hesperia) గురువారం సాయంత్రం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్న పర్వీన్ సింగ్ (Parveen Singh) అనే భారతీయ యువకుడిని జూన్ 29న పదహారేళ్ళ టీనేజర్ తుపాకీతో కాల్చి చంపేశాడు. మృతుడు పర్వీన్ సింగ్ పంజాబ్‌లోని ముకేరియన్‌ వాసి.

మెయిన్ స్ట్రీట్‌లోని మొబిల్ గ్యాస్ స్టేషన్‌లో తుపాకీ కాల్పులకు సంబంధించి గురువారం సాయంత్రం 6:21 గంటల సమయంలో హెస్పెరియా పోలీసులకు (Sheriff of Hesperia) సమాచారం అందింది. దాంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న సింగ్‌ను వారు గుర్తించారు. అనంతరం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత చనిపోయాడు.

NRI: అగ్రరాజ్యంలో వైన్ ఇండస్ట్రీని ఏలుతున్న భారతీ మహిళ.. 20 ఏళ్ల కింద మొదలైన ఆమె ప్రస్థానం.. ఇప్పుడు కోట్లలో వ్యాపారం


తుపాకీతో గ్యాస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన టీనేజర్ (Teenager) .. సింగ్ నుంచి నగదు దోచుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడు ప్రతిఘటించాడు. అంతే.. వెంటనే టీనేజర్ తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో సింగ్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం క్యాష్ కౌంటర్‌లోని నగదు తీసుకుని అక్కడి నుంచి ఊడాయించాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడైన 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి హై డెసర్ట్ జువెనైల్ హాల్‌కు తరలించారు. కాగా, చేతికి అందివచ్చిన కుమారుడు అర్ధాంతరంగా దూరం కావడంతో పర్వీన్ సింగ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

UAE: రూ.55లక్షలు విలువైన వాచీని సముద్రంలో పారేసుకున్న విజిటర్.. ఆ తర్వాత యూఏఈ పోలీసుల చాకచక్యంతో..

Updated Date - 2023-07-02T12:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising